Friday, November 20, 2020

Someshwara janardhana swamy temple Gunupudi bheemavaram West Godavari,somarama pancharama temple

 

ఆ క్షేత్రంలో శివయ్యను పౌర్ణమి, అమావాస్య రోజులలో దర్శించుకుంటే ఒక అద్భుతాన్ని చూడొచ్చు. శివలింగం రంగులు మారుతూ ఉంటుంది. బ్రహ్మాండ పురాణం శ్రీనాధుని భీమఖండం లాంటి గ్రంధాలలో ప్రస్తావించబడిన క్షేత్రం.

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు పంచారామాలు. ఆ పంచారామాల్లో ఒకటి సోమారామం.   ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామం ఈ ఐదు శివాలయాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి.  

అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సోమారామం శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో భీమవరానికి రెండు కి.మీ. దూరంలో గునుపూడిలో వెలిసిన పవిత్ర క్షేత్రం. ఇక్ష్వాకుల, తూర్పు చాళుక్యుల,గజపతులవిష్ణుకుండినుల, రెడ్డిరాజుల, శాలంకాయనుల వంటి రాజుల ఏలుబడి లో ఈ ప్రాంతం ఓ వెలుగు వెలిగినట్టు చారిత్రిక కథనాలు చెప్తున్నాయి. ఆధునిక కాలంలో కూడా ఈ ప్రాంతం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.  రాష్ట్రంలో ఇతర పట్టణాలకు భిన్నంగా భీమవరంలో అత్యంత విలాసవంతమైన జీవన విధానం కనిపిస్తుంది. అందువల్ల భీమవరం పట్టణానికి ఆంధ్రా లాస్‌వేగాస్ అని పేరు కూడా ఉంది. ఇక విషయంలోకి వస్తే  పంచారామాలలో ఒకటయిన ఈ సోమారామం ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. పరమేశ్వరుడు ఇక్కడ సద్యోజాతముఖుడై, నిత్య నూతనంగా దర్శనమిస్తుంటాడు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చెయ్యండి....


No comments:

Post a Comment

పాలకొల్లు క్షీరారామం ఆలయ విశేషాలు/ ksheera ramalingeshwara swamy temple palakollu west Godavari

  ఆ ప్రాంతం కళలకు కళాకారులకు పెట్టింది పేరు. వాణిజ్యపరంగా వాసికెక్కింది. కొబ్బరిసాగుకు పేరెన్నిక. వాణిజ్యపరంగా, రాజకీయ పరంగా , కళా , చిత్ర ర...