Saturday, November 21, 2020

పాలకొల్లు క్షీరారామం ఆలయ విశేషాలు/ ksheera ramalingeshwara swamy temple palakollu west Godavari

 ఆ ప్రాంతం కళలకు కళాకారులకు పెట్టింది పేరు. వాణిజ్యపరంగా వాసికెక్కింది. కొబ్బరిసాగుకు పేరెన్నిక. వాణిజ్యపరంగా, రాజకీయ పరంగా,కళా, చిత్ర రంగాలలో ఖండాంతర ఖ్యాతి గడించిందా ప్రాంతం. వీటన్నిటికంటే చెప్పుకోవలసింది ఆధ్యాత్మికంగా అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం. సర్వదేవతల నిలయం.  శ్రీ లక్ష్మీ జనార్ధనులు, సరస్వతిబ్రహ్మదేవులు ,విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి, ఆంజనేయ, నవగ్రహలు, వీరభద్రుడు, సూర్యభగవానుడు, సప్తమాతృకలు, కనకదుర్గమ్మ, నటరాజస్వామి, దత్తాత్రేయులవారు, ఇలా సకల దేవతలతో,మహర్షులతో పరమేశ్వరుడు కొలువుతీరిన క్షేత్రం. అందుకే ఈ క్షేత్రం  పరమపుణ్యధామంగా చెప్తున్నాయి పురాణాలు. శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం. శ్రీ మహావిష్ణువే తొలిపూజ చేసిన క్షేత్రమది. స్వయంగా శ్రీమహావిష్ణువే క్షేత్రపాలకుడుగా ఉన్న శైవ క్షేత్రం. శ్రీశైలం లో నూరు పక్షాలు, గయ లో 80 గడియలు, కేదారేశ్వరం లో వంద సంవత్సరాలు , వారణాసి లో ఒక సంవత్సరం ,రామేశ్వరం లో వెయ్యేళ్లు, హరిద్వార్ 8 సంవత్సరాలు భక్తి తో నివసిస్తే కలిగే ఫలం –ఈ క్షేత్రంలో ఒక్క నిద్ర చేస్తేనే లభిస్తుందని పురాణ కథనాలు చెప్తున్నాయి. అలాంటి అద్భుత క్షేత్రవిశేషాలుతెలుసుకోవాలంటే  ఈ వీడియో క్లిక్  చెయ్యండి.....

No comments:

Post a Comment

పాలకొల్లు క్షీరారామం ఆలయ విశేషాలు/ ksheera ramalingeshwara swamy temple palakollu west Godavari

  ఆ ప్రాంతం కళలకు కళాకారులకు పెట్టింది పేరు. వాణిజ్యపరంగా వాసికెక్కింది. కొబ్బరిసాగుకు పేరెన్నిక. వాణిజ్యపరంగా, రాజకీయ పరంగా , కళా , చిత్ర ర...