Thursday, November 28, 2019

saleshwaram jathara Telangana | cave temple saleshwaram in Telangana | secrets in nallamala fores

సలేశ్వరం.... ఓ అద్భుతం. ఓ సాహసం. ఓ ఆధ్యాత్మిక వైభవం. ఎన్నో రహస్యాలకు నిలయమైన నల్లమల అడవుల్లో తెలంగాణా రాష్ట్రంలో పూర్వం మెహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది సలేశ్వరం. సంవత్సరానికి 5 రోజులు మాత్రమె ఉండే ఈ యాత్ర అత్యంత ప్రసిద్ధమైన అమర్నాథ్ తో పోలుస్తూ తెలంగాణా అమర్నాథ్ అని ఎందుకు ప్రసిద్ధి చెందింది...... 

Wednesday, November 27, 2019

Yadadri | Yadagirigutta |yadagirigutta lakshminarasimha swamy temple telangana|yadagirigutta history

దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో నరసింహ క్షేత్రాలుఎక్కువ. దేశంలోనే ఏకైక నవనారసింహక్షేత్రం అహోబిలం అయితే పంచనారసింహక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాదగిరిగుట్ట. తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదగిరి గుట్టకు సంబంధించి ప్రధానమైన కథనం యాదమహర్షికి సంబంధించినదైతే ఇంకొకటి ప్రహ్లాదునితో ముడిపడిన కథనం......ఆ విశేషాలు ఈ వీడియోలో  

Tuesday, November 26, 2019

Hathiram baba story telugu | hathiram bhavaji history|hathiram baba|barsi celebrations in Tirumala

సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడినే తనతో పాచికలాడేలా చేయగలిగిన పరమభక్తుడు బావాజీ. ఆ బావజీయే తరవాతి కాలంలో హాతీరాం బావాజీ గా ప్రసిద్ధి చెందాడు. హాథీరాం బావాజీతో ఆడిన పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం ఉంది.

Sunday, November 24, 2019

secrets about kanakadurga temple Vijayawada|kanakadurga temple history|indrakeeladri kanakadurgamma

విజయవాడ అంటే కృష్ణమ్మ, విజయవాడ అంటే ఇంద్రకీలాద్రి. విజయవాడ అంటే రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రం. విజయవాడ అనగానే వెంటనే మన కళ్ళముందు కదిలేది అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ తల్లి. కనకదుర్గమ్మ, విజయవాడ ఈ రెండు పేర్లు కలగలిసిపోయి విజయవాడ అంటే కనకదుర్గమ్మ, కనకదుర్గమ్మ అంటే విజయవాడ జ్ఞాపకం వచ్చే పరిస్థితి. విజయవాడలో కనకదుర్గమ్మ ఎందుకు వెలిసింది ఎలా వెలిసింది ఎప్పుడు వెలిసింది ఈ విషయాన్ని గురించి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విభిన్నమయిన కథనాలు చెప్తారు. ఇక్కడ వెలసిన అమ్మకు సంబంధించి ఎన్ని కథనాలున్నాయో విజయవాడకు కూడా అన్నే కథనాలున్నాయి.... అంతకు మించిన కథనాలున్నాయి ఇంద్రకీలాద్రి కి కూడా. మరి ఆ కథానాలేంటో తెలుసుకుందాం....

Wednesday, November 20, 2019

pandu mirapakaya pachadi in Andhra style | korivi karam pickle in easy way | red chilli pickleDharidevi temple uttarakhand mystery | kalimath mandir uttarakhand |dharamata | power of dharidevi

ధారీదేవి....ఆదిశక్తి ఉగ్రస్వరూపమైన మహాకాళి అవతారమే ఈ ధారీదేవి. ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ, సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ, శక్తిపీఠాల గురించి చెప్తూ దేవీ భాగవతంలో కూడా ప్రస్తావించబడింది. ఈ ఆలయానికి సంబంధించి అనేక వింత కథనాలు వినబడతాయి. బధ్రీనాధ్ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో, అందమైన హిమగిరులలో చల్లటి మంచుకొండల మధ్య రుద్రప్రయాగకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీనగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోను కల్యాసౌర్ గ్రామంలో అలకానంద నది ఒడ్డున ఉంది ధారీదేవి ఆలయం.

Tuesday, November 19, 2019

5 mystery vinayaka temples in india|mayureshwar temple Maharashtr|ranathambor ganesh temple rajastan

ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏ దేవతను పూజించినా ముందుగా వినాయక పూజ చేయాల్సిందే. విఘ్నాలకు అధిపతిగా... గణాలకు అధినేతగా... ప్రధమ పూజలందుకుంటాడు వినాయకుడు. సిరులకు సంపదలకూ... విజయాలకూ అభివృద్ధికీ...అన్నిటికీ ప్రధానం గణేశుడు. ఎందరు దేవుళ్ళను మొక్కుతున్నా... గణపతి ధ్యానం చేయకుండా ఏ దేవుడ్ని కొలిచినా ప్రయోజనం వుండదని చెప్తారు. అలాంటి వినాయకుడు వివిధ ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలిసాడు. అలాంటి 5 వింత వినాయక దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

Friday, November 15, 2019

Tiruvannamalai temple history | arunachalam temple mystery | tiruvannamalai tourist places

ఆ క్షేత్రం వేదాల్లోను పురాణాలలో వర్ణించబడిన క్షేత్రము. సాక్షాత్తూ శివుడి ఆజ్ఞతో విశ్వకర్మ నిర్మించాడట. అక్కడ జరిగే పూజావిధానమంతా శివుడి ఆజ్ఞతో గౌతమ మహర్షి ఏర్పాటు చేసాడట. Adi ఒక మహనీయుని మహర్షిగా లోకానికి అందించిన క్షేత్రం. ఎంత చల్లటి కాలంలో అయినా ఈ ఆలయంలో మాత్రం చాల వేడిగా ఉంటుందట. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్షపెట్టినది, లింగరూపంలో ఉద్భవించినది ఇక్కడేనట. పరమేశ్వరుని అర్థనారీశ్వర రూపం ఇక్కడే ఉద్భవించిందట. ఈ క్షేత్రంలో ప్రదక్షిణ చేస్తున్నపుడు ఎవరికైనా కాలికి గాని వెలికి గాని గాయమయితే సాక్షాత్తో శ్రీ మహాలక్ష్మిదేవే ఆ గాయాన్ని నయం చేస్తుందట. ముఖ్యంగా కార్తిక పౌర్ణమికి ఆ క్షేత్ర వైభవం చూడడానికి రెండు కళ్ళు చాలవు. పంచభూత లింగాలలో ఒకటి ఆ క్షేత్రంలోనే ఉంది. ఇక్కడున్న ఆలయం కంటే ఈ క్షేత్రంలో ఉన్న కొండకే ప్రాధాన్యత ఎక్కువ. ఈ క్షేత్రాన్ని భక్తితో దర్శించి శ్రధ్ధతో స్వామిని పూజిస్తే, పూజించినవారు మాత్రమేకాక వారి తర్వాత ఇరవై ఒక్క తరాలవారుకూడా ముక్తిని పొందుతారని పురాణాల్లో చెప్పబడింది.ఇన్ని విశిష్టతలున్న ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.

Thursday, November 14, 2019

Modhera | famous sun temple in india | modhera sun temple | temples of sun god | sun temple

పూర్వం ఈ ఆలయాన్ని కట్టించిన రాజులూ వారి రాజ్యంలోని విలువైన రత్నాలను, వజ్రాలను ఈ ఆలయ పునాదుల కింద దాచిపెట్టారని చెబుతుంటారు. అందుకే ఇక్కడ విలువైన వజ్రాలు దొరుకుతున్నాయని ఇప్పటికీ వజ్రాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు కొందరు. ఈ ఆలయంలోని గర్భగుడిలో విగ్రహం అనేది ఉండదు. ఒకప్పుక్కడ ముత్యాలు, రత్నాలు రోడ్డుమీద గుట్టలుగా పోసి అమ్మెవారట. ఈ ప్రాంతం పురాణ ప్రసిద్ధమైనది. స్కాంద పురాణంలోను, బ్రహ్మపురాణంలోను కూడా ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్టు చెప్తారు. ఈ ప్రాంత వైభవాన్ని చూసి ఎంతోమంది ఎన్నోసార్లు దండెత్తి ధ్వంసం చేసారు. ఎన్నిసార్లు ద్వంసం చేసినా ఆ ఆలయప్రాభవం తగ్గలేదు... మరి ఆ ఆలయం మేది.. ఎక్కడుంది ఈ విశేషాలు తెలుసుకుందాం.....
ఈ జగత్తుకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అలాంటి ప్రత్యక్ష దైవానికి ఆలయాలు మాత్రం చాల తక్కువనే చెప్పాలి. అందులో చెప్పుకోదగిన ఆలయం మొధేరా సూర్య దేవాలయం. ఈ దేవాలయ చరిత్ర రామాయణ కాలం నాటి చరిత్రతో ముడిపడి ఉంది. త్రేతాయుగంలో శ్రీ రాముడు బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన తరువాత రామునికి బ్రహ్మహత్య పాపం అంటుకుందట. ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం ఎలా అని రాముడు వశిష్ట మహర్షిని అడిగాడు. అప్పుడు వశిష్ట మహర్షి ధర్మారణ్య అనే ప్రాంతానికి వెళ్లి సూర్య ఆరాధనా చెయ్యమని సలహా ఇచ్చాడట. అప్పటి ఆ ధర్మారణ్య ప్రాంతమే ఇప్పటి మోఢేరా అని చెప్తారు.


Wednesday, November 13, 2019

Vizag shilparamam jatara | ఇలాంటి చాన్స్ వస్తే ఆడపిల్లలు వదుల్తారా | Madhurawada jatara visakhapatnammuktinath temple nepal history | muktinath shakti peeth Nepaldakini kshetram

ఆ క్షేత్రంలో శైవ వైష్ణవ బేధం లేదు. శైవులకు, వైష్ణవులకు కూడా అతి ముఖ్యమైన క్షేత్రం. మరోవైపు బౌద్ధులకు కూడా అత్యంత ముఖ్యమైన ఆరాధనీయ స్థలం. అది 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఒకటి, శక్తి పీఠాలలో ఒకటి. ఎనిమిది పుణ్య స్థలాలను విష్ణుమూర్తి స్వయంగా కొలువుతీరిన స్వయంవ్యక్త క్షేత్రాలుగా ఆరాధిస్తారు వైష్ణవులు. అలాంటి స్వయంవ్యక్త క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. తాంత్రిక విద్యలను అభ్యసించే ప్రముఖ కేంద్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటని ప్రసిద్ధి చెందింది. ఎత్తైన హిమాలయ పర్వతాలపై కొలువు తీరిన ఈ క్షేత్రాన్ని దర్శించాలని హిందువులు బౌద్ధులు ఆరటపడితే....ఆ హిమగిరి సొగసులను చూడాలని విదేశీయులు ఉత్సాహపడతారు.అయితే ఈ క్షేత్రాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. ఏంటో కష్టపడి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ క్షేత్రమేది... ఎక్కడుంది ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం...


Tuesday, November 12, 2019

karthika pournami importance | different stories about karthika pournami | karthika pournami vratam
కార్తీకపౌర్ణమి. ఇది దేవతల దీపావళిపండుగ దేవదీపావళి అని చెప్తారు.  ఈ రోజునే శ్రీమహావిష్ణువు మత్స్యఅవతారం ఎత్తాడట. వృందాదేవి తులసి మొక్కగా అవతరించింది కూడా కార్తీక పౌర్ణమి రోజేనట. త్రిమూర్తి స్వరూపుడు  దత్తాత్రేయుడు పుట్టింది, సిక్కుల మతగురువు గురునానక్ పుట్టింది ఈ కార్తీక పౌర్ణమి రోజునే. ఈరోజునే కృత్తికా నక్షత్రంలో అర్ధనారీశ్వర రూపం అవతరించినట్లు చెప్తారు. ఆధ్యాత్మికంగాను, పౌరాణికంగాను, వైజ్ఞానికంగాను కూడా ఏంతో విశిష్టమైనది కార్తిక పౌర్ణమి. అలాంటి కార్తికపౌర్ణమి విశిష్టత, కార్తిక పౌర్ణమి వెనక ఉన్న విభిన్న కథనాలు తెలుసుకుందాం....
గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అంటారు. ఒక్కో సమయం, ఒక్కో మాసం, ఒక్కో దేవుడికి ప్రత్యేకమైనడిగా చెప్తారు. ఆ మాసంలో ఆయా దేవతల్ని పూజించడం అనేది అందరూ చేసేదే.... అయితే కార్తీకమాసం సర్వదేవతలకు ప్రియమైనదట. ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రతీకరమైంది కార్తీకమాసం అని పురాణాలు చెప్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కార్తీకం నోముల మాసం పూజల సమయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కార్తీకమాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేస్తుంటారు.అందులో ప్రధానంగా చెప్పుకోవలసినది కార్తీకపౌర్ణమి. కార్తీకపౌర్నమికి ఎన్నో విశిష్టతలున్నాయి. ఈ కార్తీక పౌర్ణమిని  త్రిపుర పౌర్ణమి. దేవ దీపావళి అని కూడా చెప్తారు.
పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీకపౌర్ణమికి ఉండే ప్రత్యేకతే వేరు. కార్తీకశుద్ధ పౌర్ణమి లేదా కార్తీకపౌర్ణమి అంటే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏడాది మొత్తం మీద చంద్రుడు కార్తీకపౌర్ణమి రోజున ఉన్నంత ప్రకాశవంతంగా మరే రోజూ ఉండడట.
కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి, దేవ దీపావళి అని పిలుస్తారు ఎందుకో ఆ కథనం తెలుసుకుందాం.... పూర్వం తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మదేవుడ్ని మెప్పించి, ఆకాశంలో గాని, భూమ్మీదగానీ, ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగగలిగే మూడు నగరాలను వరంగా పొందారు. దాంతో పాటు తమకు ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అయితే పుట్టిన వాడు తప్పనిసరిగా మరణించాలి కాబట్టి అలాంటి వరం ఇవ్వడం సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అయితే  రథంకాని రథంపై, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురునీ ఏకకాలంలో కొడితేనే తమకు మరణం సంభవించేలా వరం అడిగారు ఆ రాక్షసులు. తప్పనిసరిగా వరాన్ని ఇవ్వాల్సి రావడంతో వరాన్నిచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ వర గర్వంతో, అలాటి అశ్త్రాలతో తమను చంపడం ఎవ్వరికీ సాధ్యం కాదన్న ధీమాతో, తమకు ఎదురులేదన్న అహంకారంతో, లోకాలన్నింటా కల్లోలం సృష్టించారు. ముల్లోకాలు ఆ రాక్షసుల దుర్మార్గానికి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దేవలోకవాసులు వీరి ధాటికి తట్టుకోలేక బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేను. మీరు విష్ణువు దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు. విష్ణువు కూడా వారిని సంహరించే శక్తి తనకు లేదని, వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వెల్లి పరిస్తితిని వివరించాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథంగా మారింది. మేరు పర్వతం విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడు, తమ పీడా తొలగిందన్న ఆనందంతో దేవతలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారట. అందువల్ల కార్తీక పౌర్ణమిని దేవతల దీపావళి అని, పిలుస్తారని పురాణ కథనం. త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించింది కార్తీకపౌర్ణమి రోజునే కాబట్టి  దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు కూడా ఉంది.
జ్వాలా తోరణం....
కార్తీకపౌర్ణమి రోజు శివాలయాల్లో అంత్యంత వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించే ఒక విశేషమైన ఉత్సవం జ్వాలా తోరణం. కర్రలకి ఎండుగడ్డిని చుట్టి వాటిని ద్వారం రూపంలో తయారుచేసి నిప్పును వెలిగిస్తారు. అవి మంటలు మండుతుండగా వాటి కింద నుంచి శివపార్వతుల విగ్రహాలను తీసుకువెళ్తారు. ఆ జ్వాలాతోరణంలోని గడ్డిని కనుక పశువులకు తినిపించినా, గడ్డి మేటలో దాచుకున్నా సకల శుభాలూ కలుగుతాయని రైతుల నమ్మకం.  అసలు ఈ జ్వాలాతోరణం ఎందుకు చేస్తారో చూద్దాం....
దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. ఆ హాలాహలం లోకాలను సర్వనాశనం చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుంచి రక్షించమని బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుడిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన పరమశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగడానికి సిద్ధపడ్డాడు. ఆ విషాన్ని కంఠం మధ్యలోనే నిక్షేపించాడు. అందుకే పరమశివుడిని గరళకంఠుడు అని నీలకంఠుడు అని పిలవడం జరుగుతుంది. అయ్యాడు. ఇది చూసిన పార్వతీదేవి విషం వాళ్ళ తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి, శివుడికి ప్రమాద నివారణ కోసం ప్రతిసంవత్సరం అగిజ్వాల క్రిందనుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుంది. ఈ కారణంగానే ప్రతిసంవత్సరము కార్తీకశుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయాలలో ఎండుగడ్డితో చేసిన తోరణము రెండు కర్ర స్తంభాల మధ్య కట్టి,దానికి అగ్నిని ముట్టించి, ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే, ఆ జ్వాల క్రిందనుంచి శివపార్వతుల పల్లకిని మూడుసార్లు మోసుకుని వెడతారు. జ్వాలలా వెలిగే ఈ తోరణాన్ని 'జ్వాలా తోరణం' అని అంటారు. మరో కథనం ప్రకారం శివుడు దుష్టులైన త్రిపురాసురులను సంహరించి కైలాసానికి చేరుకోగా, పార్వతీదేవి ఇంట విజయం సాధించిన  తన భర్తకు దృష్టిదోషం కలిగిందని భావించి దృష్టిదోష పరిహారార్థం జ్వాలాతోరణం జరిపించిందట. ఈ జ్వాలాతోరణం దర్శించినంత మాత్రాన సమస్తపాపాలు హరింపబడతాయని, ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని కార్తీక పురాణం చెపుతుంది.
 ఈరోజునే కృత్తికా నక్షత్రంలో అర్ధనారీశ్వర రూపం అవతరించినట్లు చెప్తారు.  మహశివుడి దేహంలో సగభాగం (వామ భాగం) ఉండాలని పార్వతి కోరుతుంది. అందుకు కఠిన తపస్సు చేసిందట. పార్వతి తపస్సును మెచ్చిన శివుడు కృత్తిక నక్షత్రం రోజున పర్వతాగ్రాన ఉవ్వెత్తున మంటలు సృష్టించి, గిరి ప్రదక్షిణలు చేయాలని సూచిస్తాడట. పార్వతీదేవి అలాగే చేసింది. ప్రదక్షిణలు పూర్తయ్యాక తన దేహంలో పార్వతిని నిలుపుకుని అర్ధనారీశ్వరుడుగా పౌర్ణమినాడు అవతరిస్తాడట. కార్తీక పౌర్ణమి నోములకు  సంబంధించి విభిన్న  కథనాలు చెప్తారు. కృతయుగంలో దేవశర్మ అనే వేదపండితుడు ఉండేవాడు. అతని  కుమార్తె గుణవతి. దేవశర్మ చంద్రుడు అనే యోగ్యుడైన వరుడికిచ్చితన కుమార్తెకు వివాహం జరిపించాడు. ఒకనాడు మామా అల్లుళ్లిద్దరూ పళ్లు, పూలు తేవడం కోసం అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుడి చేత సంహరింపబడ్డారు.జరిగిన ఘోరానికి బాధపడిన  గుణవతి తండ్రికి, భర్తకి ఉత్తమగతులకోసం చేయవలసిన  కర్మలన్నీ చేసింది. తండ్రినీ భర్తను కోల్పోయిన గుణవతి జీవనం కోసం  కూలిపని చేసుకుంటూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో జీవించేది. శ్రీ మహావిష్ణువు మీదే దృష్టి నిలిపి దైవారాధనతో జీవించేది. తన చిన్ననాటి నుండి అలవాటైన కార్తీక వ్రతం ఆచరించి కార్తీకమాసం నెలరోజులూ అరటిడొప్పలో దీపం ఉంచి నదిలే వదిలేది. తర్వాత గుడికి వెళ్లి దీపం వెలిగించేది. ఇంటివద్ద తులసికి ప్రదక్షిణం చేసేది. కార్తీక ఏకాదశినాడు ఉపవాసం చేసేది. ఇలా కార్తిక మాసంలో చెయ్యవలసిన నియమాలన్నిటినీ ఆచరించేది. ఈ వ్రత పుణ్యఫలంగా ఆమె విష్ణుసాన్నిధ్యం పొందింది. ఆ గుణవతే సత్యభామగా పుట్టి శ్రీకృష్ణునికి ప్రియసఖి అయిందని ఓ కథనం.
ఇక పౌర్ణమిరోజు ఎక్కువగా చేసేది కేదారేశ్వర వ్రతం. రోజంతా కఠోర ఉపవాసముండి సాయంత్రం వేళగౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామాల్లో చూస్తే ఈ కుటుంబమంతా చేరి ఈ వ్రతం చేసుకొని, ఆ తరువాత పెద్దలు ఎంతో వినసొంపుగా కేదారేశ్వర నోముకు సంబంధించిన కథను కుటుంబ సభ్యులకు విన్పిస్తుంటారు. కార్తీకపౌర్ణమి వ్రతం అంటే కేదారేశ్వరుని నోము) చేసుకునే అవకాశం లేని  భక్తులు ఈ కథ చెప్పే ఇంటికి వెళ్లి భక్తితో కథ వినడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి (శివపార్వతులకు)మర్రిచెట్టు ఊడలను తోరణాలుగాను, మర్రిపండ్లను బూరెలు గాను, మర్రి ఆకులును విస్తర్లుగాను పెట్టి పూజలు చేయాలి.
కార్తీకపౌర్ణమి వ్రతానికి సంబంధించి మరో కథనం కూడా చెప్తారు. ఓసారి బలిచక్రవర్తికి శరీరమంతా మంటలు పుట్టాయట. ఆ సందర్భంలో ఆయన ఆస్థాన వైద్యులు, ప్రత్యేక పురోహితులు కార్తీక మాసాన శివకేశవులను ఆరాధించి కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరిస్తే ఈ బాధ నుంచి విముక్తి దొరుకుతుందని చెప్పారు. పండితుల సూచన మేరకు బలి చక్రవర్తి వ్రతాన్ని ఆచరించాడట. దీంతో బలి చక్రవర్తికి వచ్చిన మంటలు పూర్తిగా దగ్గిపోయాయట. అప్పటి నుంచి తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరిమ్చేలా చేసాడని కొన్ని కథనాలు చెప్తున్నాయి.  ఎవరైతే కార్తీకపౌర్ణమి రోజు కేదారేశ్వరుని నోము నోచుకుంటారో వారికి ఏడాదిపాటు అన్న వస్త్రాదులు, సిరిసంపదలకు లోటుండదని పురాణాల ద్వారా తెలుస్తుంది.
కర్తీకంలో ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఒక  భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు.  పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానం లేకపోవడంతో సంతానం కోసం శివుని ప్రార్ధించారు. అయితే వారి ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. కాని సంతానం కోసం ఆరాటపడుతున్న వారికి సంతానం మాత్రం ఇవ్వాలనుకున్నాడు.అందుకే 'అల్పాయుష్కుడు, మేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగాడు,- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో తమ కుమారుడు ఎక్కడ మరనిస్తాడో అని దిగులు పట్టుకుంది. సరిగ్గా  ఆ సమయంలోనే అపర  శివభక్తురాలైన అలకాపురి రాజకుమార్తె గురించి తెలుసుకొని, ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే ఆమె తన భక్తితో తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చుకుంటుందని ఆమె తో వివాహం చేసారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందామె. తక్షణమే భక్తితో శివుని ప్రార్ధించి వ్రతం చేసి  శివున్ని ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. అందుకే ఈ వ్రతాన్ని భక్తేశ్వర వ్రతం అని కూడా చెప్తారు.
ఇక కార్తీకమాసంలో స్నానం,  దీపారాధనలను ప్రధానంగా చెప్తారు అందులోను పౌర్ణమిరోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యముందని పండితులు చెప్తున్నారు. శివ, విష్ణు దేవాలయాల్లో రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీదా, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలపై బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఇక శివాలయంలో ధ్వజస్తంభంపై నందాదీపంతో పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎతె్తైన ప్రదేశాల్లో భరిణల్లో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొనె్నల్లో దీపాలు వెలిగించి చెరువులు, నదులు వంటి జల వనరుల్లో విడిచి పెడతారు.హిందూ ధర్మంలో  దీపానికి గొప్ప ప్రత్యేకత ఉంది. దీపం కాంతికి చిహ్నం, జీవానికి సాక్ష్యం. అందుకే ఇంటి పూజాగదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండాలని పెద్దలు చెబుతారు. అలా రోజూ దీపం పెట్టె అవకాశం లేనివారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా దీపాన్ని వెలిగిస్తే మంచిదని పెద్దలు చెప్తారు. వీలైతే సంవత్సరంలో ఉన్న రోజులన్నింటికీ గుర్తుగా ఈ రోజున 365 వత్తులు వెలిగించమని చెబుతారు.
ఇక ఈ కార్తీక పౌర్ణమి సిక్కులకు కూడా ఏంటో ముఖ్యమైన పవిత్రమైన  రోజు. సిక్కుల మతగురువు గురునానక్ పుట్టింది ఈరోజునే అందుకే ఈ రోజు సిక్కులకు మహాపర్వదినం. కార్తిక పౌర్ణమి గురునానక్ జయంతిని గురుపూరబ్ అన్న పేరుతొ ఘనంగా జరుపుకుంటారు.అని అంటారు.
ఇక వైజ్ఞానికంగా చూస్తె  ఈ కార్తీక దీపాలను వెలిగుంచే ఆనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతవరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుందని చెప్తారు.
 


kashi ganga ghats details/dashashwamedh ghat history/kashi ganga harathi/kashi ganga boat ride

కాశీ అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది గంగానది . ఆ నది ఒడ్డున స్నానఘట్టాలు. గంగా స్నానానికి అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీలో స్నాన ఘట్ట...