Wednesday, November 28, 2018

srisailam history & temple information|srisailam tourist places|srisailam tour guide|akka mahadevi caves

srisailam history & temple information|srisailam tourist places

శ్రీశైలం... ప్రముఖ శైవ క్షేత్రం. శైవక్షేత్రాల్లో తలమానికం శ్రీశైలం. కురుక్షేత్రంలో లక్షలకొద్దీ దానాలు చేస్తే, గంగలో రెండువేల సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సుచేస్తే, కాశీక్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించే పుణ్యం శ్రీశైలం క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించడం ద్వారా పొందగలమని ధార్మికులు విశ్వసిస్తారు. భువిపై వెలసిన కైలాశం శ్రీశైలం అని వర్ణిస్తారు.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. ఆదిశక్తి కొలువుదీరిన అష్టాదశ  శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన ప్రాంతంగా కూడా శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అష్టాదశ మహాశక్తి పీఠాలలో శ్రీశైల భ్రమరాంబిక శక్తిపీఠం రెండవది. అందుకే, శ్రీశైలం ‘భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి’ క్షేత్రంగా పేరొందింది. భువిపై కైలాసం శ్రీశైలం విశేషాలు ఈ వీడియోలో ....  

Sunday, November 25, 2018

Ahobilam temple|hidden secrets of ahobilam nallamala forest|Nava narasimha temples ahobilam

Ahobilam temple|hidden secrets of ahobilam nallamala forest|Nava narasimha temples ahobilam

అహోబిలం ... ప్రసిద్ధ నారసింహ క్షేత్రం. నరసింహ క్షేత్రాల ప్రస్తావన రాగానే  మొట్టమొదట చెప్పుకోదగిన క్షేత్రంగా అహోబిలం క్షేత్రం గురించి చెప్తారు. నవ నారసింహ క్షేత్రం అహోబిలం దట్టమైన నల్లమల అడవుల్లో ఉన్న ఓ రహస్యాల నిలయం. సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉన్న అహోబిలం అద్భుతాల గుట్ట. రహస్యాల నిధి.                                                        అహోబిల స్వామి అంధ్రా పద్మనాభుడు. ఇదేంటీ అహోబిల స్వామి నరసింహస్వామి కదా... పద్మనాభుడేంటి!? అనుకుంటున్నారు కదూ... అవును అందుకే రహస్యాల నిధి అహోబిలం అన్నారు.                                                                                                                  కృత యుగంలో ఇక్కడ వెలసిన నరసింహస్వామిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరస్వామి కూడా దర్శించుకుని ఆరాధించినట్టు చరిత్ర చెప్తోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకిన అందందే గలడు అని చాటి చెప్పిన బాల భక్తుడు ప్రహ్లాదుని మాటను నిజం చేస్తూ స్తంభంలో ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలం. అహోబిలం క్షేత్ర చరిత్ర ఈ వీడియోలో ......

Wednesday, November 21, 2018

Ashtadasa shakti peethas|dakshayagna vinashanam|sati devi story


Ashtadasa shakti peethas|dakshayagna vinashanam|sati devi story

 శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు ఎన్నో, ఎన్నెన్నో...  ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు.ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినబడతాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ ఇలా విభిన్న సంఖ్యను చెప్తుంటారు. వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా,అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నాం.
వీటిలో పన్నెండు శక్తి పీఠాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా శ్రీలంకలో ఒకటి  మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉన్నాయి. 
ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో గయ, పిఠాపురం, జాజ్ పూర్ అనే మూడూ  గయాక్షేత్రాలూగానూ, శ్రీశైలం, ఉజ్జయిని అనే రెండూ జ్యోతిర్లింగ క్షేత్రాలూ గానూ ఉండటం మరో విశేషం. 

ఇక ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఎందుకు,ఎప్పుడు ఏర్పడ్డాయో చూద్దాం.


Wednesday, November 7, 2018

evadigola vadide, mithunam music director swara veenapani interview|72 melakartala swaraveenapani


mithunam music derector swara veenapani

స్వర వీణాపాణి.... ఆ పేరులోనే ఓ వైవిధ్యం.... ఆ వైవిధ్యం అసలు పేరు రమణమూర్తి. శాస్త్రీయ సంగీతంలో కృషి... సినీ సంగీతంలో ప్రవేశం....ఫిల్మ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సంగీత దర్శకత్వం....పేరుకు తగట్టు వైవిధ్యంతో కూడిన చిత్రాలు....ఇప్పుడు సంగీత చరిత్రలోనే ఓ సరికొత్త ఆవిష్కరణ ఇదీ స్వర వీణాపాణి. 72 మేళ కర్త రాగాలను వీణాపాణి ఆరున్నర నిమిషాలలో గానం చేయగల ఒక కీర్తనగా సృష్టించి ఓ సరికొత్త ఆవిష్కరణ చేసారు. దానికి స్వరకామాక్షి అని పేరు పెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీతవేత్త జుబిన్‌ మోహతా, ‘పద్మవిభూషణ్‌ మంగలంపల్లి బాల మురళీకృష్ణ, ‘పద్మభూషణ్‌ జేసుదాసు, ‘పద్మబూషణ్‌ ఎల్‌ సుబ్రహ్మణ్యం, అమెరికాలోని గ్రావిూ అవార్డు విజేత ‘పద్మశ్రీ విశ్వమోహన్‌ భట్‌, ‘భారత రత్న లతా మంగేష్కర్‌ లాంటి మహామహులు ఈ ఆవిష్కరణ నిజంగా ఓ  అద్హుతం, అపూర్వం అని ప్రశంచించారంటేనే స్వర వీణాపాణి సాధించిన ఘనత ఏంటన్నది అర్ధమవుతుంది.

పట్టుకోండి చూద్దాం చిత్రంతో సినీసంగీత రంగంలో ప్రవేశించిన స్వరవీణాపాణి తొలి చిత్రమే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. తరువాత ఎవడిగోలవాడిదే లాంటి కామెడీ చిత్రాలకు, ఆ తరువాత మిధునం, దేవస్థానం లాంటి క్లాసిక్ చిత్రాలకు  సంగీతాన్నందించి తన విభిన్నతను చాటుకున్నారు. ఆ విలక్షణ సంగీత దర్శకుడు స్వర వీణాపాణితో చిట్ చాట్ ......

Saturday, November 3, 2018

Kanyakumari tourism|Kanyakumari temple tamilnadu|vivekananda rock memorial|gandhi mandap Kanyakumar


Kanyakumari tourism|Kanyakumari temple tamilnadu|vivekananda rock memorial|gandhi mandap Kanyakumar

కన్యాకుమారి .... మూడు మహా సముద్రాల కలయికకు వేదిక కన్యాకుమారి. భారతదేశపు దక్షిణ భాగంలో చిట్టచివరి జిల్లా కన్యాకుమారి. కన్యాకుమారి ఆలయం, వివేకానంద రాక్, ప్రఖ్యాత తమిళ తిరువళ్లూర్ అరుదైన విగ్రహం, మహాత్మాగాంధీ స్మారక మందిరం, పద్మనాభపురం పేలెస్, ఇలా ఎన్నో అరుదైన అద్భుతాలకు నిలయం కన్యాకుమారి. భారతదేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఒకే  ప్రదేశంలో ఒకే సమయంలో చూడగలిగే ఒకే ఒక్క ప్రదేశం కన్యాకుమారి. 


కన్యాకుమారిలో తప్పనిసరిగా చెప్పుకోవలసిన మరో అరుదైన అద్భుతమ్ పౌర్ణమి నాడు ఒక వైపు సూర్తాస్తమయం మరో వైపు చంద్రోదయం చూడడం. గతం లో 'కేప్ కొమరిన్' గా ప్రఖ్యాతి చెందిన కన్యాకుమారి త్రివేణి సంగమంగా చెప్పుకుంటారు. తమిళ్ నాడు లో ఉన్న ప్రఖ్యాత పర్యాటకకేంద్రం కన్యాకుమారికి ఓ వైపు బంగాళాఖాతం మరోవైపు అరేబియా సముద్రం దిగువన హిందూ మహా సముద్రం ఈ మూడూ కలిసి అద్భుత ఆవిష్కరణ. పవిత్ర యాత్రాస్థలంగానే కాదు ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది కన్యాకుమారి. అందుకే ఇది  స్వదేశీయులనే కాదు వేలాదిమంది విదేశీయులను కూడా ఆకర్షించే అద్భుత ప్రముఖ యాత్రాస్థలం. భక్తీ, ముక్తి, అందం, ఆహ్లాదం, ఆశ్చర్యం, అద్భుతం వెరసి కన్యాకుమారి. సో..... ఈ రోజు వీడియోలో కన్యాకుమారి విశేషాలు చూద్దాం.....

kashi ganga ghats details/dashashwamedh ghat history/kashi ganga harathi/kashi ganga boat ride

కాశీ అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది గంగానది . ఆ నది ఒడ్డున స్నానఘట్టాలు. గంగా స్నానానికి అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీలో స్నాన ఘట్ట...