"" vijayavahini: Motivational & inspirational story of kinjal singh IAS | ఇదో నిజజీవితగాధ

Thursday, October 4, 2018

Motivational & inspirational story of kinjal singh IAS | ఇదో నిజజీవితగాధ


 inspirational story of Kinjal singh IAS

కొన్ని జీవితాలు అచ్చంగా సినిమా కథల్లాగే ఉంటాయి. కాదు కొందరి జీవిత కథలే సినిమాలుగా మారతాయి. ఇప్పుడు మీరు వినబోయే స్టోరీ కూడా అలాంటిదే. ఓ వండర్ ఫుల్  బయోపిక్ కి ఏమాత్రం తీసిపోని స్టోరీ. తండ్రిని చంపిన వాళ్లను కటకటాల వెనక్కి పంపాలని కంకణం కట్టుకుని, అమ్మ మీద ఒట్టేసి మరీ ఐఏఎస్ అయింది. ఇదిగో మీ నాన్న అని అమ్మ చెప్తే ఆ నాన్నను సరిగ్గా గుర్తు కూడా పట్టలేని పసిప్రాయంలోనే ఆ నాన్న దూరమయ్యాడు. చెయ్యిపట్టి నడిపించే తండ్రిని ఆ చెయ్యి అమ్డుకోకుండానే పరలోకానికి పంపేశాయి శత్రుమూకలు. పసితనంలోనే అమ్మ గుండెల్లో భగభగ మండే మంటల్ని చూడగలిగింది.  ఆ మంటలే స్పూర్తిగా తన జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. 30 ఏళ్లనాటి ప్రతీకారం తీర్చుకుంది. మూడు దశాబ్దాల తన తల్లి ఆవేదనను కోర్టులో ఆవిష్కరించి జడ్జిచేత సెభాష్ అనిపించుకుంది. ఆమె.... కింజల్ సింగ్ ఐఏఎస్

ఇది సినిమా కథ కాదు నిజజీవిత గాధ. ఈ కధ ఈనాటిది కాదు. ముప్పై అయిదేళ్ళ క్రితం నాటిది. అది 1982  మార్చి 12వ తేదీ. ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మాదాపూర్ గ్రామం. అర్ధరాత్రి. నిజాయితీకి మారుపేరైన పోలీస్ ఆఫీసర్ DSP ఎస్.పి. సింగ్ స్థావరం. కొందరు క్రిమినల్స్ గురించి ఉప్పందడంతో తన  సిబ్బందితో కలిసి DSP ఎస్.పి. సింగ్ ఉన్నపళంగా బయలుదేరాడు ఆ రాత్రి వేళ. అలా వెళ్ళిన dsp మరి వెనక్కి రాలేదు. అతని శరీరం మాత్రం ఆ మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది. క్రిమినల్స్ ని పట్టుకునే ప్రాసెస్ లో అనుకున్నట్టుగానే నేరస్తులు తలదాచుకున్న ఇంటికి చేరుకున్నారు పోలీస్ బలగాలు. అంతా నిశ్శబ్దం. ఊరంతా నిద్రమత్తులో జోగుతోంది. ఎలాగైనా నేరస్తులని పట్టుకోవాలన్న పట్టుదలతో తన సిబ్బందికి సూచనలిస్తూ విధినిర్వహణలో నిమగ్నమయ్యాడు dsp సింగ్. హటాత్తుగా అక్కడ పోలీసుల్ని చూసి వారి మీదికి ఎదురుదాడికి దిగారు క్రిమినల్స్. కాల్పులు మొదలయ్యాయి. తుపాకుల మోతతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది. ఆ ప్రాసెస్ లో sp సింగ్ హతుడయ్యాడు. దుండగుల బాంబు దాడికి అతను బలయిపోయినట్టు అతని బార్య విభాసింగ్ కి వార్త అందింది. అయితే ఆమె దాన్ని నమ్మలేదు. తన భార్త మీద అతని క్రింది ఉద్యోగులు కొందరికి వైరం ఉందని ఆ పగతోనే వాళ్ళే తన భర్తను హత్య చేసారని గోల చేసింది. తన భర్త ను హత్య చేసిన వారిని శిక్షించి న్యాయం చేయమని 'విభాసింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచనలం రేపిన సంఘటన ఇది.తన క్రింది ఉద్యోగుల అవినీతిని ప్రశ్నించాడన్న అక్కసుతో అతని క్రింది ఉద్యోగే అతన్ని అదను చూసి చంపెసాడని తేలిపోయింది. కేసును సిబిఐ కి అప్పగించారు. తోటి ఉద్యోగులే క్రిమినల్స్ తో కలసి ఒక పథకం ప్రకారం అతన్ని హత్య చేసారని సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతని కూతురు కింజాల్  ఆర్నెల్ల పాప, మరో కూతురు ఇంకా లోకం చూడని ప్రింజాల్ సింగ్ అమ్మ కడుపులోనే ఉంది. డీఎస్పీ భార్య విభాసింగ్ ఒంటరి పోరాటానికి దిగింది. అప్పుడే కడుపులోని బిడ్డ ఈ లోకంలోకోచ్చింది. ఇద్దరు చంటిపిల్లను వెంటేసుకుని కోర్టుల చుట్టూ తిరిగింది విభాసింగ్. చార్జిషీట్లు, సాక్ష్యులు, వాదాలు,ప్రతివాదాలు, వాయిదాలు.. కేసు ఇలా సాగుతూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఆమెకు జరిగిన నష్టానికి గాను విభాసింగ్ కి వారణాసి ట్రెజరీ లో ఓ చిన్న ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం. ఓ వైపు బ్రతకడానికి కొత్తగా చేరిన ఉద్యోగం. మరో వైపు పొత్తిళ్ళలో చేరిన పసిబిడ్డ. అన్నిటి కంటే ముఖ్యంగా భర్తతో పనిచేసిన సహోద్యోగుల సహాయ నిరాకరణ. ఒంటరి పోరాటం. వీటన్నిటితో  భర్త  మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం ఆమె  చేసిన పోరాటం నీరు కారి పోయింది.
    మగదిక్కులేని సంసారం. ఇద్దరు పసిపిల్లలు. అరకొర ఉద్యోగం. అయినా ధైర్యం కోల్పోలేదు. సమస్యల సుడిగుండంలో ఈదుతూ దొరికిన ఆధారంతోనే ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది విభాసింగ్. అనుక్షణం వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలోనే గడిపింది విభాసింగ్. కింజాల్, ప్రింజాల్ లిద్దరూ తల్లి స్థయిర్యాన్ని, తండ్రి ధైర్యాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని  ఇష్టపడి చదువు సాగించారు.
పెద్దమ్మాయి  కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది. చదువే ధ్యేయంగా, తండ్రి హంతకుల్ని శిక్షించడమే లక్ష్యంగా ముందుకు సాగిపోతోంది. సరిగ్గా ఆ సమయంలోనే కాలం ఆ కుటుంబం మీద మరోసారి ఎదురుదాడి చేసింది. కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి కాన్సర్ అని తెలుసింది. ఆమె మరణానికి చేరువలో ఉందని బయటపడింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా కింజాల్ యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోకుండానే, తన పిల్లల ప్రయోజకత్వం చూడకుండానే పరలోకానికి చేరుకుందా తల్లి విభాసింగ్.

     2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు. ముఖర్జీ నగర్ లో ఒక సాదారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు.  upsc కి చదవడమంటే మాటలు కాదు. చదవాలంటే ఎన్నో పుస్తకాలు కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే డబ్బు కావాలి. అది వాళ్ళ దగ్గర లేదు. ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళ యజ్ఞం మొదలింది. వాళ్ళముందున్నది ఒకటే లక్ష్యం...చదవాలి. పెద్దస్తాయికి చేరుకోవాలి. తమ తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. తమ తండ్రికి న్యాయం జరగాలి.ఇది మాత్రమే వాళ్ళ కళ్ళకు కనబడే లక్ష్యం. ఆ లక్ష్యం ముందు ఇంకేదీ కనబడలేదు. ఆ లక్ష్య సాధనలోనే గురిపెట్టి వదిలిన బాణంలా దూసుకుపోయారు అక్కచెల్లెళ్ళు.
2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు. అనుకున్నట్టుగానే కింజల్ సింగ్ ఐఏఎస్ అయింది. తనేదురు చూస్తున్న సమయం వచ్చింది.జీవితకాలం ప్రతీకారాన్ని తీర్చుకునే టైమొచ్చింది. 30 ఏళ్లనాటి కేసు తిరగదోడింది. మళ్ళీ మొదలయింది సంఘర్షణ. వాదాలు ప్రతివాదాలు సాక్ష్యులు, వాంగ్మూలం..వాయిదాలు  ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా కేసు ముందుకెళ్ళింది. నిజం నిప్పులాంటిది అంటారు. అది ఒక్కసారిగా భగ్గుమంది. 8మంది పోలీసులను సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. మొత్తం 19 మంది మీద చార్జిషీటు దాఖలైతే, విచారణ జరిగే సమయంలో పదమంది చనిపోయారు. మరో ఏడుగురు రిటైరయ్యారు. బూటకపు ఎన్ కౌంటర్ చేసినందుకు ముగ్గురు పోలీసులకు మరణశిక్ష, మరో ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది కోర్ట్. కింజల్ పగ చల్లారింది. తల్లి ఆత్మ శాంతించింది. అన్యాయానికి గురయిన ఆమె తండ్రికి న్యాయం జరిగింది. 31 ఏళ్ల పోరాటం ఫలితాన్నిచ్చిండి. తీర్పు విన్న తరువాత కోర్టులో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.  అయితే అప్పుడు 'లఖింపూర్ ఖేరి' జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ మాత్రం తన దుఖం దాచుకోలేక పోయింది. కన్నీళ్లు దారాలు కట్టాయి. అవును మరి తను చేసిన తపస్సుకు ఫలితం దక్కిన క్షణమది. అందుకే ఆ ఉద్వేగం. 

No comments:

Post a Comment