"" vijayavahini: October 2018

Wednesday, October 31, 2018

Hanuman chalisa|hanuman chalisa origin history |Tulsidas story

Hanuman chalisa|hanuman chalisa origin history |Tulsidas story

 హనుమాన్ చాలీసా భయాన్ని పోగొట్టి, అభాయాన్నిచ్చేది, ధైర్యాన్ని, స్థయిర్యాన్ని ఇచ్చేది. విజయాన్ని, వీరత్వాని ప్రసాదించేది హనుమాన్ చాలీసా. ఆంజనేయ భక్తులకు అఫ్ అద్భుతవరం. ఏ చిన్న ఆపద, కష్టం, కలత కలిగినా వాటన్నిటినీ పటాపంచలు చేసే అద్భుత ఆయుధం హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసా ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో.....ఆ వివరాలు ఈ వీడియోలో......

port venkateswara temple vizag|ross hill church Visakhapatnam|ishaq madina dargah vizag|port temples

vizag port temple - ross hill - Dargakonda - ishak madina baba

 విశాఖపట్నంలో ఆ ప్రాంతం మతసామరస్యానికి చిహ్నం. అక్కడ కొలువు తీరిన మూడు కొండలు మూడు మతాలకు చెందిన చిహ్నాలు కొలువున్నా, అన్నీ కలిసి భిన్నత్వంలో ఏకత్వానికి, మతసామరస్యానికి ప్రతీకగా ఠీవిగా నిలుస్తాయి. అవే శ్రీ వేంకటేశ్వర కొండ, రాస్ కొండ, దర్గా కొండ. ఈ మూడు కొండల మీద మూడు విభిన్న మతాలకు చెందిన విగ్రహాలు ఉన్నాయి. వేంకటేశ్వర కొండ మీద వెంకటేశ్వర దేవాలయం, రాస్ హిల్ మీద వర్జిన్ మేరీ చర్చి, దర్గా కొండ మీద ఇస్లామిక్ సెయింట్ బాబా ఇషాక్ మదీనా యొక్క సమాధి ఉన్నాయి. అవి ఎప్పుడు, ఎలా, ఎందుకు ఏర్పడ్డాయో ఆ వివరాలు ఈ వీడియోలో......Tuesday, October 30, 2018

Celebrity temples in India|sonia gandhi temple|mahatma gandhi temple|rajanikanth temple|mgr temple

celebrity temples

అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ దేవాలయాల్ని చూడాల్సిందే. ఆ దేవాలయాల్లో ఉండేది దేవుళ్ళు కాదు. దేవతలు కూడా కాదు. పోనీ రాక్షసులా అస్సలు కాదు. సెలబ్రిటీలు. ఎస్ ... సెలబ్రిటీలు. సో ఈ రోజ వీడియోలో ఆ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో... అ టెంపుల్స్ లో పూజలందుకుంటున్న సెలబ్రిటీలెవరో చూద్దాం....


Monday, October 29, 2018

Mayong | India’s black magic capital mayong village assam|land of black magic |black magic village

Mayong black magic capital of India
మయోంగ్! ఓ అద్భుతం! మయోంగ్ ఓ రహస్యం! మయోంగ్ ఓ గగుర్బాటు! మయోంగ్ ఓ భయం! మయోంగ్ ఓ భీభత్సం! మయోంగ్ ఊహకందని ఊహాతీతశక్తి! బ్లాక్ మేజిక్ కాపిటల్ ఆఫ్ ఇండియా అని, లేండ్ ఆఫ్ బ్లాక్ మేజిక్ అని చెప్పుకునే మయోంగ్ హేరీపోటర్ మాయాలోకానికి చాలా దగ్గరగా కనిపించే ఒక మాయాలోకం, అద్భుత ప్రపంచం.


ఆ గడ్డ మీద ఎదో శక్తి ఉంది అలాగని అదేదో దేవాలయం కాదు. అక్కడికెళితే ఏవో వింత వింత శబ్దాలు వినపడతాయి. అలాగని అదేదో ఘోస్ట్ విలేజ్ కాదు. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతలోనే ఒళ్ళు గగుర్పొడిచే భయముంది. నిశ్శబ్దం లోనే లీలగా భయంకర శబ్దాలు.... అవి మనకు కూడా వినిపిస్తుంటాయి. కాని ఆ శబ్డాలేంటో మాత్రం మనం చెప్పలేం. అసలా శబ్దాలు ఎక్కడి నుంచి వస్తుంటాయో కూడా అర్థం కావు. అదే అద్భుత మాయాలోకం మయోంగ్.... ఆ మయోంగ్ విశేషాలు ఈ వీడియోలో మీకోసం......


Sunday, October 28, 2018

Goa of east Vizag history|Visakhapatnam jewel of east coast|tourist places in Visakhapatnam


విశాఖపట్నం, విశాఖ,  వైజాగపట్నం,….అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న పేరు. విశాఖపట్నం.. ఒకనాడు  చిన్న బెస్త గ్రామం... మరి నేడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న మెగాసిటీ 


Vizag Goa of east

అక్కడక్కడా విసిరేసినట్లుండే ఇళ్లు... మిణుకుమిణుకుమనే దీపాలు... చీకటి పడితే గాఢాంధకారం... చిన్న జ్వరంవచ్చినా ప్రాణాలను నిలుపుకోలేని దుస్థితి... అంతా కలిపి 60 వేల జనాభా ఇదీ ఒకప్పటి విశాఖపట్నం చిత్రం.   
                                       
                                                           ఆధునిక ప్రమీలా రాజ్యం 

 మరిప్పుడు...... ఆకాశ హర్మ్యాలతో, విద్యుత్ దీపాల  ధగధగలతో,  సువిశాల రోడ్లతో, ఎలాంటి రోగాల్నయినా తరిమికొట్టే  మల్టీస్పెషాలిటీ  హాస్పిటల్సతో, రెండు మిలియన్‌ పైచిలుకు జనాభాతో, నగరమంటే ఇలా ఉండాలనిపించేలా, స్టీల్‌ సిటీ, సిటీ ఆఫ్‌ డెస్టినీ అన్న బిరుదులతో వెలిగిపోతోంది. ఇదీ ఇప్పటి విశాఖ చిత్రం. 
విశాఖ నగరానికి చాలా పేర్లే ఉన్నాయి. వాటి వెనుక చాలా కథలు కూడా ఉన్నాయి. ఇక్కడి సముద్ర తీర సమీపంలో ఇక్కడి ప్రజలు ‘‘వైశాఖీ దేవి’’ ఆలయాన్ని నిర్మించుకున్నారు. కాల క్రమేణా ఆ ఆలయం సముద్రంలో మునిగిపోయింది. కానీ ఆ వైశాఖీ దేవీ పేరు మీద  వైశాఖీపట్నం. విశాఖీ పట్నం అనే పేరు నిలబడిపోయింది.


ఇదొక కథనం ..  ఈ నగరం అసలు పేరు ఇసుక పట్టణం అని, సముద్ర తీరాన ఇసుకలో ఏర్పాటయిన ఒక చిన్న గ్రామాన్ని  ఇసుక పట్టణం అనే వారని, అదే విశాఖ పట్టణం గా మారిందని మరో కథనం. ఇషాక్‌ అనే ఒక ముస్లిం ఆధ్యాత్మికవేత్త  పేరు మీద ‘‘ఇషాక్‌ పట్టణం’’ పేరు వచ్చిందని అదే కాలక్రమంలో విశాఖపట్నం గా మారిందని మరో  కథనం. అయితే ఈ కథనాలకు సరైన  ఆధారాలు మాత్రం లేవు. ఇక మరో కథనం ప్రకారం శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి.

Vizag city history

ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులలో ఒకరు ఇక్కడ‌ విశాఖేశ్వరుని దేవాలయం నిర్మించినట్లు అది కాలక్రమేణా సముద్రగర్భంలో కలిసిపోగా దాని జ్ఞాపకార్ధం ఈ జిల్లాని విశాఖేస్వరపురమని ఆ తరువాత అదే  విశాఖపట్టణంగా మారినట్లు చెబుతారు. కొంతకాలం 11వ శతాబ్దంలో తమిళ వ్యాపారుల వలన ‘కుళోత్తుంగ చోళపట్నం’గా, బ్రిటిష్‌ పాలకుల హయాంలో 19వ శతాబ్దంలో ‘వైజాగ్‌ పటమ్‌’గా ప్రచారంలో వున్నా, విశాఖపట్నమే శాశ్వతమైనదిగా నిలిచిపోయింది.
                                     ఇప్పటికీ మిస్టరీ వీడని గుడి 
ఇక  చరిత్రకారులు చెప్తున్న చారిత్రక నేపథ్యం బట్టి చూస్తే  అశోకుడి కాలంలో నే ఈ నగరం ఏర్పడిందని తెలుస్తోంది. అశోకుడు కళింగ సామ్రాజ్యం మీద దండ యాత్ర చేసి, పశ్చాత్తాపం ప్రకటించిన చరిత్ర మనం చదువుకున్నాం. ఆ కళింగ సామ్రాజ్యంలో ఇప్పటి విశాఖ ప్రాంతం కూడా ఉంది. ఆ విధంగా ఆయన ఆ తర్వాత అహింసను బోధించిన బౌద్ధాన్ని దేశమంతా.. ఖండాతరాలు దాటి శ్రీంకలో సైతం ప్రచారం చేశారు. ఆ క్రమంలో వేలాది బౌద్ధ భిక్షులు ఒక వైపు సముద్రం, పచ్చని కొండలు, ఇంకో వైపు గోస్తనీ, శారదా నదులు గల ఈ ప్రాంతాన్ని తమ నివాస స్థలంగా  చేసుకున్నారు.  అలా నివాసంగా చేసుకున్న స్థలానికి  బుద్ధుడు పుట్టిన విశాఖ నక్షత్రం పేరును పెట్టుకున్నారు. అదే విశాఖ పట్టణం. విశాఖ చుట్టూ ఉన్న బౌద్ధారామాలు తొట్ల కొండ, బావి కొండ, పావురాల కొండ, బొజ్జన్న (బుద్దన్న) కొండ..లాంటి వాటిని ఇందుకు ఆధారాలుగా చెప్తారు.
విశాఖపట్నాన్నే వైజాగ్ అని కూడా పిలుచుకుంటాం. మరి వైజాగ్‌ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఇంగ్లిష్‌ వాళ్లు విశాఖ అన్న మాటను స్పష్టంగా పలకలేక వైసాగ్ పట్నం అని పలికేవారట. అది క్రమక్రమంగా వైజాగ్‌ పట్టణం అయి చివరికి వైజాగ్ గా స్థిరపడిపోయింది.
ఇక వాల్తేర్ అని పిలవడం కూడా ఉంది. అప్పట్లో  పాత  పోష్టాఫీసు దగ్గర  విశాఖ  రైల్వే స్టేషను  అని  మరొకటి  ఉండేది....   వాల్తేర్ అనేది విశాఖలో ఒక ప్రాంతం పేరు . ఆ ప్రాంతానికి దగ్గరలో మరో రైల్వే స్టేషన్ ఏర్పాటయింది. అయితే అప్పటికే విశాఖలో ఒక స్టేషన్ ఉండడంతో దీనిపేరు వాల్తేర్ ఆ పేరుతోనే విశాఖలో మరో స్టేషన్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ తరవాతి కాలంలో  విశాఖ స్టేషను  ఎత్తేశారు. వాల్తేర్ స్టేషనే  విశాఖ  స్టేషనుగా చలామణి  అయ్యింది. చాలాకాలం  తరవాత దానిని  విశాఖ రైల్వే స్టేషనుగా  మార్చారు. అలా కొంతకాలం రైల్వే స్టేషన్ పేరునే వాడుతూ విశాఖపట్నం న్ని వాల్తేర్ అనడం జరిగిందట. 
Visakhapatnam city story

ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు  సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే నట. ఈ ప్రాంతంలోనే ఉన్న భీమునిపట్నంలో భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల రాతి ఆయుధాలు కూడా ఉన్నట్టు చెప్తారు.
ఇక మరో కథనం ప్రకారం 9-11 శతాబ్దపు  ఆంద్ర రాజుకాశీకి ,   వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఈ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై, తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు అని తెలుస్తుంది.. కాని పురాతత్వ శాఖ ప్రకారం  ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడిని మనం చూడలేం ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు అన్నది ఒక అంచనా.
విశాఖపట్నంలో ఒకే ప్రాంతంలో మూడు కొండలు మూడు మతాలకు, మతసామరస్యానికి చిహ్నంగా కనబడతాయి. అవే శ్రీ వేంకటేశ్వర కొండ, రాస్ కొండ దర్గా కొండ.ఈ మూడు కొండల మీద మూడు విభిన్న మతాలకు చెందిన విగ్రహాలు ఉన్నాయి. వేంకటేశ్వర కొండ వెంకటేశ్వర దేవాలయం, రాస్ హిల్ మీద వర్జిన్ మేరీ చర్చి, దర్గా కొండ మీద ఇస్లామిక్ సెయింట్, బాబా ఇషాక్ మదీనా యొక్క సమాధి ఉన్నాయి.  వీటన్నిటినీ కలిపి శృంగమణి పర్వతంగా వ్యవహరిస్తారు.
తూర్పుతీరం గోవా నగరంగా పిలుచుకునే విశాఖపట్నంలో ఆ ప్రాంతం మతసామరస్యానికి చిహ్నం. అక్కడ కొలువు తీరిన మూడు కొండలు మూడు మతాలకు చెందిన చిహ్నాలు కొలువున్నా, అన్నీ కలిసి భిన్నత్వంలో ఏకత్వానికి, మతసామరస్యానికి ప్రతీకగా టీవిగా నిలుస్తాయి.
port venkateswara temple &Ross hill in visakhapatnam

మూడు కొండలలో దక్షిణాన ఉన్న కొండ వెంకటేశ్వర కొండగా పిలుస్తారు. ఒకప్పుడు డచ్ దేశస్తులు మన దేశంలో వర్తక,వ్యాపారాలు నిర్వహించేవారు. ఆ సందర్భంలోనే ఓసారి 1792 వ సంవత్సరంలో సముద్ర మార్గం ద్వారా ఈ ప్రాంతంలో బ్లాక్మూర్ కెప్టెన్ గా వస్తున్న ఒక నౌక సరిగ్గా హార్బర్ కు చేరే సమయానికి తీవ్రమైన తుఫాన్ లో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందట. ఆ సమయంలో నౌకలో ఉన్న ఒక హిందూ కార్మికుడు  తోటివారితో కలిసి ప్రమాదం నుంచి రక్షించమని భాగావంతున్ని ప్రార్ధించాడట. విచిత్రంగా అంట తీవ్రమైన, భయంకర తుఫానులో కూడా అక్కడ ఉన్న ఒక శిల నౌకను సముద్రంలో మునిగిపోకుండా అడ్డుగా నిలిచిందట. దాంతో ఆ నౌక, నౌకలోనివారు పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. తుఫాన్ తీవ్రత తగ్గింతరువాత అక్కడ పరిశీలిస్తే నౌక మునిగి పోకుండా కాపాడిన శిల వెంకటేశ్వరస్వామి విగ్రహంగా తెలిసిందట. దాంతో అప్పటి గ్రామ పెద్ద కొండమీద స్వామికి గుడికట్టి ప్రతిష్టించినట్టు ఒక కథనం. ఈ ఆలయంలో స్వామి సేవలలో ఒక ప్రత్యేకత ఉంది. ఇంకెక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడు తన దేవేరులు శ్రీదేవి,భూదేవి లతో కలిసి ప్రతి సంవత్సరం కల్యాణోత్సవం జరుపుకొని సముద్రజలాల్లో విహరిస్తాడు.


ఇక రాస్ హిల్ విషయానికి వస్తే కొండపై ఉన్న రోమన్ కాథలిక్ చాపెల్ 'మదర్ మేరీస్ చర్చి' 1864 లో మాన్స్యూర్ రాస్ చే నిర్మించబడింది. కన్యామారి కొండగా ప్రసిద్ది చెందిన మేరీ రాస్ హిల్ క్రైస్తవులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం.  ఈ కొండకు 1864 లో ఈ కొండమీద ఇల్లు నిర్మించుకొని నివసించిన ఆంగ్లేయుడు మిస్టర్ రాస్ పేరు పెట్టారు.
ఇక దర్గా కొండ....సుమారు 700 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇషాక్ మదీనా నివసించే వాడని అక్కడే అతని సమాధి కూడా ఉందని. ఆ బాబా గౌరవార్ధం ఆ కొండను ఇషాక్ మదీనా కొండ అని, దర్గా కొండ అని పిలవడం జరుగుతోంది.
ఈ కొండల మీది నుండి హార్బర్ వీక్షణ అద్భుతమైన అనుభవం. 
ఆర్టిసి కాంప్లెక్స్ నుండి 5 కిలోమీటర్ల దూరంలోని పోర్ట్ ఏరియాలో ఉన్నాయి ఈ మూడు కొండలు. విశాఖ ఆర్టీసి కాంప్లెక్స్ నుండి బస్సుల్లోను లేదంటే ఆటల్లో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ కు చేరుకొని అక్కడి నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ మూడు ఆలయాలకు చేరుకోవచ్చు.
ఇక విశాఖపట్నం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి అందమైన బీచ్ లు. విశాఖపట్నంలో తప్పనిసరిగా చూడాల్సిన ముఖ్యమైన బీచ్ లు రామకృష్ణా బీచ్, తొట్లకొండ బీచ్, రిషికొండ బీచ్,గంగవరం బీచ్, భీమిలి బీచ్.

రామకృష్ణా బీచ్

విశాఖపట్నం బీచ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది రామకృష్ణ బీచ్. ఇక్కడున్న  రామకృష్ణ మిషన్ ఆశ్రమం కారణంగా ఈ పేరొచ్చిందని చెప్తారు.వచ్చింది. ఈ బీచ్ సన్ బాతింగ్ లకు, సర్ఫింగ్ కు ప్రసిద్ధి. సమీపంలోనే లాసంస్ బీచ్ కలదు. ఈ రెంటిని కలిపి జంట బీచ్ లు గా పిలుస్తారు.ఈ బీచ్ లో ప్రధాన ఆకర్షణ , ఐ ఎం ఎస్ కుర్సూర సబ్ మెరైన్ మ్యూజియం.
Visakhapatnam beaches

రిషికొండ బీచ్

విశాఖపట్నంలో మరో అందమైన బీచ్ రిషి కొండ బీచ్. దీనిని తూర్పు కోస్తా ఆభరణం అని పిలుస్తారు. వైజాగ్ కు ఎనిమిది కి. మీ. ల దూరంలో ఉంది అందమైన రిషికొండ బీచ్ . ఇక్కడి ఇసుక బంగారు వన్నెతో వుండి , అలల ప్రవాహం మెల్లగా సాగుతుంది. ఈ బీచ్ లో అనేక వాటర్ స్పోర్ట్స్ కూడా కలవు.

భీమిలి బీచ్


భీముని పట్నంకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రదేశం ఒకప్పుడు డచ్ దేశపు వలస ప్రాంతంగా వుండేది. ఆ  అవశేషాలు ఇప్పటికి ఇక్కడ కనపడతాయి. ఇక్కడ 1850 లలో నిర్మించిన ఒక పురాతన చర్చి మరియు లైట్ హౌస్ లు, పురాతన లక్ష్మి నరసింహ టెంపుల్ కూడా చూడవచ్చు

యారాడ బీచ్

విశాఖపట్నం కు 15 కి. మీ. ల దూరం లో ఉంది యారాడ బీచ్. ఒకవైపు కొండలతోను, మిగిలిన  మూడు వైపులా బంగాళా ఖాతం తోను ఈ బీచ్ ఎంతో సుందరంగా వుంటుంది. దీనికి కొద్ది దూరంలో డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్ ఉంటాయి. ఈ యారాడ బీచ్ సమీపంలోనే కొండపై వెంకటేశ్వర స్వామీ దేవాలయం  రోస్స్ హిల్ చర్చి, మసీదు ఉంటాయి.
Beaches in Vizag

కైలాసగిరి 

విశాఖపట్నంలో చూడవలసిన మరో సుందర ప్రదేశం కైలాసగిరి. ఇది విశాఖపట్నంలోనే ఒక వండర్ ఫుల్ పిక్నిక్ స్పాట్.  2003 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కైలాసగిరిని "ఉత్తమ పర్యాటక ప్రదేశం"గా గుర్తించింది. లక్షలాదిమంది స్వదేశీ విదేశీ పర్యాటకులు ఈ కైలాసగిరిని సందర్శిస్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం, వుడా ఈ కొండను ప్లాస్టిక్ రహిత మండలంగా ప్రకటించింది. దాదాపు 380 ఎకరాల్లో  విశాఖపట్నానికే తలమానికంగా భాసిల్లే కైలాసగిరిలో ధవళవర్ణంలో మెరిసిపోయే.. శివపార్వతుల విగ్రహం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. విశాఖ నగరానికి గుర్తింపు చిహ్నాంగా ఈ విగ్రహాన్ని పరిగణిస్తున్నారంటేనే దీనికి ఎంతటి ప్రాధాన్యం ఉందో తెలిసిపోతుంది. కొండపైన ఏర్పాటుచేసిన రోప్‌వే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొండ చుట్టూ తిరిగేందుకు చిన్నపాటి రైలును కూడా ఏర్పాటుచేశారు. 
Kailasagiri vizag

కొండ కింద ఉన్న 'కైలాసనాధుని' దేవాలయం వల్ల దీనికి 'కైలాసగిరి' అనే పేరు వచ్చింది. కైలాసగిరి కొండపై చాలా ఆకర్షణలున్నాయి. కొండ పైనుంచి విశాఖ నగర అందాలను చూడటం పర్యాటకులకు మధురానుభూతిగా మిగులుతుంది. ఓ పక్క సముద్రం, ఇంకో పక్క నగరం, మరోవైపు కొండలు చెప్పలేని ఆనందం పర్యాటకులకు కలుగుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.
విశాఖపట్నానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది కైలాసగిరి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి కూడా విశాఖపట్నానికి బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం వచ్చినవారు... కైలాసగిరికి రోడ్డు మార్గం ద్వారా బస్సు లేదా కేబ్ లేదా ఆటోల ద్వారా చేరుకోవచ్చు 
Roap way to kailasagiri hill

కైలాసగిరి పార్కు ఉదయం గం.10-00 నుండి రాత్రి గం.08-00 వరకు తెరచి ఉంటుంది.
ఇవి తూర్పుతీరం గోవా నగరంగా పిలుచుకునే విశాఖపట్నం విశేషాలు.

Monday, October 22, 2018

Mahanati Tara-4 | life story of drama actors


అనుకున్నట్టుగానే మర్నాడు సదరు నటీమణి రామేశ్వరిని కలుసుకుని తమ అనుమానాలు వ్యక్తపరిచారు స్నేహితురాళ్ళిద్దరూ. వాటన్నిటినీ తేలిగ్గా కొట్టి పారేసిందావిడ. పైగాఇబ్బందులన్నీ ఈ రంగంలోనే ఉన్నాయని ఎందుకనుకోవాలి? మిగతా వృత్తుల్లో మాత్రం ఆడవాళ్ళు ఇక్కట్లు పడడంలేదా?” అని ఎదురు ప్రశ్నించింది.
"కానీ ఇందులో మిగిలిన రంగాల్లో లేని కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు కదా మేడమ్!'' అచ్చు పత్రికా విలేకరిలా అడిగింది అనిత.
ఆ ప్రశ్నలో ఏం ధ్వనించిందోగానీ కోపం పొంగి వచ్చిందావిడ కళ్లల్లోకి. అయితే ఆమె చక్కటి నటి కాబట్టి అంతలోనే మామూలుగా అయిపోయింది.మీ దృష్టిలో ప్రత్యేకమైన సమస్యలంటే ఏమిటి?'' అనడిగి వాళ్ళ సమాధానం ఆశించనట్టే తనే చెప్పసాగింది.
సాధారణంగా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ సాయంకాలాలు ఆలస్యంగా మొదలవుతాయి. నాటకమంతా అయి ఇంటికి వెళ్ళేసరికి చాలా పొద్దుపోతుంది. ఒక్కోసారి ప్రదర్శనల కారణంగా తరచుగా కుటుంబాన్ని వదిలి ఊర్లు తిరగాల్సి వుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని చూసుకోడం కొంచెం కష్టమనిపిస్తుంది. ఏం! మామూలు ఉద్యోగాలు చేసుకుంటున్న ఆడవాళ్ళు మాత్రం పిల్లలపట్ల అంతగా శ్రద్ధ కనబరచగలుగుతున్నారా? ఇలాంటివే మరి కొన్ని... అఫ్ కోర్స్. మన నటనకు వచ్చే మెచ్చుకోళ్లతో వీటిని మరచిపోవడం పెద్ద కష్టమనుకోనుఅంది.
నిజానికి వీళ్ళ ఊహకందనన్ని అవమానాలనే చవిచూసిందావిడ తన వృత్తి కారణంగా. ఇప్పుడవన్నీ వీళ్ళ ముందు వెల్లడిస్తే తనకు అవమానం. వీళ్ళముందు చులకనయిపోతానన్న భావంతో అసలు విషయాన్ని దాచిపెట్టింది. కానీ తాను హిపోక్రసీతో చెప్పిన మాటలు మరో ఆడపిల్లను కష్టాల కొలిమిలోకి నెట్టేందుకు దోహదపడుతున్నాయని ఆలోచించలేకపోయింది.
ఇంటికి తిరిగివస్తూ దారిలో అంది తార "అనూ! ఇప్పటికైనా నువ్వు అనవసరంగా భయపడ్డావని ఒప్పుకుంటావా? ఆవిడన్నట్లు ఏ ఉద్యోగాలో  చేసుకుంటే మాత్రం పరిస్థితులన్నీ తిన్నగా వుంటాయని నమ్మకమేంటి? పైగా వాటి కంటే ఈ రంగంలో పేరుప్రతిష్టలు, ప్రశంసలు, అవార్డులు అదనంగా లభిస్తాయి. రామేశ్వరిగారి మాటలు విన్నాకయినా నీ అనుమానాలు తీరిపోయా యనుకుంటాను."
అనిత ఏం మాట్లాడలేదు. స్నేహితురాలి వాదన అంతగా నచ్చలేదామెకు. తార చాలా సున్నిత మనస్కురాలు. తానుగా ఎవర్నీ కష్ట పెట్టదు. తనను ఎవరైనా కాస్త పరుషంగా అవమానకరంగా మాట్లాడితే సహించలేదు. దాన్నే పదే పదే గుర్తు చేసుకుని తనలో తనే మధనపడి పోతుంది. ఏ విషయాన్నయినా తేలిగ్గా తీసుకునే మనస్తత్వం కాదు. అలాంటివారు ఈ రంగంలో ఇమడగ లరా? స్నేహితురాలు త్రోవ మార్చుకుంటే బాగుండుననిపించిందా అమ్మా యికి.
                                              * * *
అమ్మా!' నెమ్మదగా పిలిచింది తార.
స్వెట్టర్ అల్లుతున్న పార్వతి తలెత్తి చూసింది ఏమిటన్నట్టు, తను ఎదురు చూస్తున్న సమయం వచ్చేసినట్టుంది అనుకుందామె. ఆ అమ్మాయి తన ప్రేమ వ్యవహారం వెల్లడిచేస్తే తనెలా రియాక్టవ్వాలి. ఆ పిల్లను తన దారిలోకి తెచ్చుకోవడానికి ఎలా మాట్లాడాలి అన్నది మనసులోనే ప్రాక్టీస్ చేసుకుంటోంది.
అమ్మా! ఒక ప్రముఖ నాటక సమాజంలో నటించడానికి నాకు అవకాశం వచ్చిందిఅంటూ నెమ్మది నెమ్మదిగా విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది తార.
దిమ్మెరపోయింది పార్వతి. అప్పటివరకూ చేతిలోని ఊలుదారాలను యాంత్రికంగా మెలికలు తిప్పుతున్న ఆమె చేతివేళ్ళు సడెన్ గా ఎవరో పట్టి ఆపినట్టుగా ఆగిపోయాయి. ఇదేమిటి... తను ఊహించిన విషయం ఒకటైతే, కూతురు మరో కొత్త సంగతి చెబుతుందేమిటి? ఒక ప్రమాదం తప్పిపోయినందుకు సంతోషించాలో, ఇంకో కొత్త సమస్య తెచ్చి పెట్టినందుకు బాధపడాలో అర్ధంకాలేదు. అసలు దీనికీనాటకాల పిచ్చి ఎలా పట్టుకుంది? అయినా తప్పు తనదేనేమో! తను మొదటే ఖండిస్తే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు. | ఏది ఏమైనా ఇప్పుడు కఠినంగా ఉండాలనే నిర్ణయించుకుంది.
అమ్మా!బెరుగ్గా పిలిచింది తార.
“ఊ.....”
నువ్వేం చెప్పలేదు.
ఏం చెప్పమంటావు? నాటకరంగంలో అడుగు పెట్టడమంటే కాలేజీకెళ్లి ఆడుతూ పాడుతూ చదువుకోవడం అనుకున్నావా? అక్కడి వాతావరణాన్ని నువ్వు తట్టుకోగలననే అనుకుంటున్నావా?''
అదికాదమ్మా!''
కూతురి మాట పూర్తికాకుండానే అందుకుంది పార్వతి.ఏదికాదు. నువ్వు స్టేజెక్కి నాటకాలేయడం మొదలెడితే నిన్ను పెళ్లి చేసుకో వడానికి ఎవరైనా ముందుకొస్తారా? అసలీ జన్మలో నీకు పెళ్లవుతుందా?” కోపంగా అంది.
ఏం అదేమంత తప్పుపనా... నాటకాలు వేసినంత మాత్రాన వివాహం జరక్క పోవడానికి? అయినా ఎంతమంది నటించడంలేదు. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు కాలేదా?” ఉక్రోషంగా అంది తార.
ఆ... ఆ... ఎందుకవడంలేదు. మహా బాగా అవుతున్నాయి. వాళ్లెంత హాయిగా, సుఖంగా బ్రతుకుతున్నారో చూడ్డంలేదూ!''
"ఆ...మామూలువాళ్ళు మాత్రం ఏ చీకూ చింతా లేకుండా బ్రతికేస్తున్నారూ''  దీర్ఘం తీసింది తార.
ఇదిగో తారా! నువ్వనవసరంగా వాదనకు దిగకు. నువ్వు నటించడం నాకి ష్టంలేదంతే!''
అదే... ఎందుకిష్టంలేదూ అని. అదేమైనా నీతిమాలిన పనా?' “నాచేత అట్టే వాగించకు. ఇప్పటివరకు చెప్పిందంతా ఏంటి? ఇంకా విడమరిచి చెప్పాలా? నీ నటనను గొప్పగా పొగిడిన వెధవలే నీ వెనుక అదీ ఇదీ అంటూ నీచంగా మాట్లాడతారు. నువ్వు వేదికమీద నటిస్తే జీవితంలో కూడా నీతో నాటకాలాడ్డానికి ప్రయత్నిస్తారు కొందరు నీచులు. అవన్నీ నువ్వు భరిం చగలవా?'' “నువ్వనుకున్నట్టుగా ఏం ఉండదట అక్కడి పరిస్థితి. రామేశ్వరిగారని ఒక నటిని కలసి మాట్లాడానునేను. ఎలాంటి అవమానకరమైన, అసహ్యకరమైన వాతావరణం ఉండదట.'' “నువ్వెంత ఎంక్వయిరీలు చేసుకున్నా నీకంటే ఎక్కువ జీవితాన్ని చూసిందాన్ని. నేను అనుభవంతో చెప్పేది కూడా కాస్త వినవే తారా!"
ఈ ఒక్కసారి చూసి అంతగా ఆ పరిసరాలు నచ్చకపోతే మానేస్తాన్లే అమ్మ" నచ్చచెప్తున్నట్టుగా అంది తార.
నువ్వు లక్ష చెప్పు... నేను వినను. అయినా పెద్ద చదువులు చదువుతామని పేచీలు పెట్టే ఆడపిల్లల్ని చూసాం. పెళ్లి చేసుకోమంటే ససేమిరా అంటూ ఉద్యోగాల వెంటబడే పిల్లల్ని చూశాం. కానీ నువ్వేంటి నాటకాలో అంటూ మొదలెట్టావు?' "అదికాదమ్మా "
"చూడు తారా! తండ్రిలేని పిల్లవని నిన్ను గారం చేసినందుకు నేను పశ్చాత్తాపపడేలా చెయ్యకు. ఇక ఈ విషయంలో చర్చలనవసరం. నువ్వు నటించడా నికి వీల్లేదంతే!'' ఖచ్చితంగా చెప్పి అక్కడ్నించి వెళ్లిపోయింది పార్వతి.
మతిపోయినదానిలా తల్లి వెళ్లినవైపే చూస్తుండిపోయింది తార. “ఛ! ఎంత ప్రయత్నించినా అమ్మను ఒప్పించలేకపోయాను. ఇప్పుడేం చేయడం? వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలంటే ఏడుపొచ్చేస్తోంది. తన మొదటి ప్రయత్నంలోనే లభించిన ప్రశంసలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఏ ఆశయం లేకుండా సాధారణ మనిషిగా బ్రతికేయకుండా ఎప్పటికైనా ఒక గుర్తింపును పొంది నలుగురిలోనూ ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడాలన్న ఆకాంక్ష బలంగా వుంది తనకు. అదృష్టవశాత్తూ తన ఆశ తీరే మార్గం ఆతి చేరువలోనే వున్నా అందుకోలేకపోతోంది. తల్లిమీద బాగా కోపం వచ్చింది తారకు. తన మాటే తనది కానీ ఎవరి మాటా వినదు. అందరూ తన మాటే వినాలి. ప్రతీదీ తను చెప్పినట్టే చేయాలి...” కసిగా అనుకుంది. ఈ సంఘర్షణతో తల బ్రద్దలైపో తోంది. ఎలాగైతేనేం ఆలోచించి... ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.

Thursday, October 18, 2018

Mahanati Tara-3 | Life story of drama actors


ప్రేమ! అదొక నిర్వచనానికి అందని అందమైన భావం. అలాంటి ప్రేమకు చక్కని ఉదాహరణగా, నిజమైన ప్రేమకు నిదర్శనంగా షాజహాన్ ని చెప్తారు. షాజహాన్ కు తన భార్య ముంతాజ్ బేగం పైగల ప్రేమను, ఆ ప్రేమకు చిహ్నంగా అతడు కట్టించిన విశ్వంలోనే అపురూపమైన కట్టడంగా, ప్రపంచ వింతల్లో ఒకటిగా భాసిల్లుతున్న పాలరాతి మందిరం తాజ్మహల్ గురించి, దాని నిర్మాణ క్రమం గురించి ఆకర్షణీయంగా వర్ణించి చెప్తున్నారు హిస్టరీ లెక్చరర్.
ఆ ప్రేమకథను ఆసక్తిగా వింటున్నారంతా. హిస్టరీ లెక్చరర్ వర్ణనతో ముగ్గులై పోయిన చాలామంది స్టూడెంట్స్ ఆ అపురూప ప్రేమచిహ్నాన్ని ఎప్పటికైనా చూసి తీరాలని నిర్ణయించుకున్నారు అప్పటికప్పుడే. తార కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తోంది. అయితే ఆమె ఆలోచనల్లో వున్నది. షాజహాన్ చక్రవర్తి ప్రేమకథ కాదు. ఈమధ్య వారానికొకటిగా తప్పనిసరిగా తనకోస్తున్న పేరులేని ప్రేమలేఖల గురించి. అవి ప్రేమలేఖలు అనవచ్చో, అనకూడదో గానీ నిజానికి ఆ ఉత్తరాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందలు, పలకరింపులేతప్ప పేజీలకొద్దీ సాగే ప్రేమ కబుర్లేం ఉండవు. అసలా ఉత్తరాలు రాస్తుంది ఆడో మగో కూడా తెలీదు. అయినా ఆ ఉత్తరాలకోసం ఎదురుచూడ్డం బలహీనతగా మారింది తారకు. అసలు తన క్లాస్ మేట్స్ ఎవరైనా తనను అల్లరి పెట్టడానికి అలా రాస్తున్నారా అన్న అనుమానం కూడా వచ్చింది. ఆ ఉద్దేశ్యంతోనే వాళ్ళని చాలా నిశితంగా పరీక్షించేది. కానీ అనుమానించదగ్గ ఆధారాలేమీ దొరక్కపోవడంతో ఈ అజ్ఞాత ప్రేమికుడెవరో చాలా పిరికివాడిలా ఉన్నాడే.... పేరు కూడా రాయడంలేదు! అనుకుంది. ఎందుకో ఆ భావం ఎక్కువసేపు మనసులో ఉంచుకోలేకపో ది. తాము ఇష్టపడే వ్యక్తుల్లోని బలహీనతలుకూడా బలహీనతలుగా కనబడవేమో!
“తారా! ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?” అడిగింది అనిత. .. “అబ్బే ఏంలేదు. నేనేం ఆలోచించడంలేదే!
 అది చెప్పడానికి అంతగా తడబడడం ఎందుకో?'' ఏడిపిస్తున్నట్టు అంది
“తడబాటా! నా....నాకెందుకు తడబాటు?''
“అదేమిటో మరి నీ మాటలే చెప్తున్నాయి. అయినా నువ్వు ఏమాలోచిస్తున్నావో...ఎవరికోసమెదురు చూస్తున్నావో నాకు తెలుసులే” అల్లరిగా అంది అనిత.
నీ మొహం! నేనెవరికోసం ఎదురుచూస్తాను?”
పోస్ట్ మేన్ కోసం!''
ఛ! అతనికోసం నేనెదురుచూడ్డం ఏమిటి?” కోపంగా అంది తార.అఫ్ కోర్స్! ఆతనికోసం అంటే అతను తెచ్చే ఉత్తరం కోసమన్న మాట!'' ఉలిక్కిపడింది తార.ఇలా మాట్లాడుతుందేమిటి? కొంపదీసి తన విషయం తెలిసిపోలేదుకదా!''
ఏయ్! ఏంటి మళ్ళీ స్వీట్ డ్రీమ్స్ లోకి వెళ్లిపోయావా?'' చేతిలోని కవరును తార కళ్ళ ముందు ఆడిస్తూ అంది అనిత. తేరుకున్న తార దాన్ని లాక్కోబోయింది.
ఏయ్ ఇలా దౌర్జన్యం చెయ్యడానికి ప్రయత్నిస్తే ఎంతమాత్రం సహించేది లేదు. విషయమేంటో నీ నోటిద్వారా వినవలెనని మాకు చాలా కుతూహలంగా ఉంది. ఆలస్యాన్నిక ఎంతమాత్రం భరించలేం. అసలు సంగతేమిటో విన్నవించుకో! అప్పుడే ఈ లేఖను నీకిచ్చే విషయం ఆలోచిస్తాం'' అంది నాటకీ యంగా.
ప్లీజ్ అనితా! దాన్నిలా ఇవ్వవేబ్రతిమాలసాగింది తార.సరే...సరే! నువ్వింతగా వేడుకుంటున్నావు కాబట్టి మాకు నీపై దయ కలుగు తున్నది. అయితే ఇలా రాసినవారెవరో చెప్పుము.” “అదా...అదీ... ఒక ఫ్రెండ్!
ఎవరా ఫ్రెండ్? ఆడా మగా?” కవ్వింపుగా అంది అనిత.
ఏంటా క్రాస్ ఎగ్జామినేషన్. అనూ నీకిది ధర్మం కాదే. స్నేహితురాల్ని ఐతగా ఏడిపిస్తున్నందుకు భగవంతుడు నిన్ను తప్పక శపిస్తాడుఉక్రోషంగా అంది తార.
ఆ... భగవంతుడు శపిస్తే ఏ దేవతలో దిగివచ్చి శాపవిమోచనం చేస్తారు ? ఇంతకీ విషయం చెప్పలేదు.
“ఇక తప్పదనుకున్న తార అంతా వివరించింది. అంతా విన్న అనిత పెదవి విరిచింది. “ఓస్ ఇంతేనా? ఇంకా ఈ ఉత్తర కుమారుడేదో పేజీల కొద్దీ ప్రేమ పైత్యం ఒలకబోస్తాడేమో, చదివి కాస్త ఎంజాయ్ చేద్దామనుకున్నాను. అయినా నీ అజ్ఞాత పేమికుడింత పిరికివాడేమిటే  బాబూ! పిరికివాడే కాదు పిసినిగొట్టు కూడాను. లేకపోతే ఈ పొడిమాటల ప్రేమేంటే బాబూ!''
మూతి ముడుచుకుంది తార.
 స్నేహితురాలిని ఇంకా ఇంకా ఉడికించడం ఇష్టంలేక తన చేతిలో కవర్ ఇవ్వడానికి బేరం పెడుతూ అంది అనిత. "ఇదిగో అలా మూతి ముడుచుకోకుగానీ ఇది నీకివ్వాలంటే మాత్రం నువ్వో పని చేయాలిఅంది కవర్ చూపిస్తూ.
"చెప్పు ఏం చేయాలి?” ఇక ఆలస్యాన్ని ఏమాత్రం భరించలేనట్టు గొంతు నిండా ఆత్రాన్ని నింపుకుని అడిగింది తార.
“సింపుల్! నువ్వు నన్ను సినిమాకు తీసుకెళ్లాలిలంచాలకు అలవాటుపడినదానిలా అంది.
“ఓస్ ఇంతేనా? తప్పకుండా తీసుకెళతాను!
“ప్రామిస్!
“ప్రామిస్! అబ్బ చాలుగానీ అదిలా ఇవ్వవే" విసుగ్గా లాక్కుని లైబ్రరీలోకి పరుగుతీసింది. కవరొకసారి ఇష్టంగా చూసి లోపలి పేపర్ బయటకు తీసింది. దాన్ని చూస్తుంటే అప్రయత్నంగానే విజయ్ గుర్తుకువచ్చాడు. దాంతోపాటు అతని చూపులు కూడా! ఇదేమిటి! ఈ సమయంలో అతను జ్ఞాపకం వచ్చాడెంటి? కళాభారతిలో పరిచయం తరువాత అనుకోకుండా నాలుగైదుసార్లు కలుసుకోవడం జరిగింది. అతడు మాట్లాడేది తక్కువయినా ఆ చూపులు మాత్రం ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్లు ఉండి తనను ఇబ్బంది పెడుతుంటాయి. కానీ ఎందుకో అతని సాన్నిహిత్యం ఆనందాన్నిస్తోంది. తను.. తను విజయవైపు ఆకర్షింపబడుతోందా? మరి.. ఈ ఉత్తరాలు? వీటికోసం ఎదురుచూడడం ఒక బలహీనతగా మారింది తనకు, ఇటు అజ్ఞాత ఉత్తరాల వ్యక్తి అటు విజయ్. ఈ ఆకర్షణల మధ్య తన జీవితం ఏ మలుపు తిరగ బోతోందోనన్న ఆందోళన మొదలయింది తారలో!తారా...తారా" కంగారుగా పిలుస్తూ వచ్చింది అనిత.
 ఏమిటి అనితా ఆ కంగారు?” "నింపాదిగా అడుగుతున్నావా తల్లీ! మన యముడుగారు నీకోసం కబురుపెట్టాడు.”
వాళ్ళ దృష్టిలో యముడంటే ప్రిన్సిపాల్. ఎంత అల్లరిపిల్లలయినా అతని ముందు పిల్లులవ్వాల్సిందే. సాధారణంగా ఎవర్నీ తన రూముకు పిలిపించుకోడు. ఎవర్నయినా పిలిచాడూ అంటే వాళ్ళకేదో మూడిందన్నమాటే. అందుకే అతడ్ని స్టూడెంట్స్ అంతా ముద్దుగా యముడు అని పిలుచుకుంటారు. అలాంటి మనిషి ఈరోజు తారను పిలిపించాడంటే భయపడకుండా ఎలా వుంటుంది? సాలోచనగా ప్రిన్సిపాల్ రూములోకి పగు పెట్టింది తార. అక్కడ అతనికె రుగా ఒక వ్యక్తి కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆ మనిషిని చూడగానే ఎక్కడో చూసినట్టనిపించిందామెకు.
ఎక్కడ చూసింది? ఎంత ఆలోచించినా జ్ఞాపకం రావడంలేదు........................
“గుడ్ మోర్నింగ్ సర్” విష్ చేసింది తార ప్రిన్సిపాల్ ని.
 "గుడ్ మార్నింగ్! రామ్మా ... తారా! ఇలా కూర్చో...” ఎదురుగా వున్న కుర్చీని చూపించి, పరీక్షలకు బాగా ప్రిపేరవు తున్నావా?” ఆప్యాయంగా అడిగారు.
తమ సంస్థకు పేరు తెచ్చి పెట్టే స్టూడెండ్స్ ను చూస్తే ఎంత స్ట్రిక్ట్ టీచర్లుగా పేరు పడ్డవారికైనా ప్రేమాభిమానాలు పుట్టు కురావడం సహజమే.
ఎస్ సార్!'' ప్రిన్సిపాల్ ప్రశ్నకు సమాధానంగా అంది తార.
తన ఎదురుగా వున్నతన్ని చూపిస్తూ చెప్పసాగారు ప్రిన్సిపాల్ గారుఇదిగో ఈయన రామారావుగారని మన తెలుగు నాటకాల్లో బాగా పేరు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు."
ఈ గదిలో అడుగుపెట్టినప్పటినుంచీ ఇతడిని ఎక్కడ చూసానా? అని తనను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది తారకు. ఈయన తన కాలేజీ వార్షి కోత్సవానికి వచ్చిన ఆహ్వానితుల్లో ఒకరు..
ప్రిన్సిపాల్ చెబుతున్నాడుఅంతే కాదు, ప్రతిభగల నూతన కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఒక నాటకసమాజాన్ని స్థాపించి దాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు కూడా. రాజమండ్రిలో ఏవో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలున్నాయిట. దానికి వీరు కూడా ఒక నాటకాన్ని తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఇప్పుడా పనిమీదే నీకోసం వచ్చారు" ఆ పెద్దమనిషిని పరిచయంచేస్తూ అన్నారు ప్రిన్సిపాల్
ఈ చివరి మాటకు ఉలిక్కిపడింది తార. 'అతడు నాటకోత్సవాలకు వెళితే తనకు చెప్పడం ఎందుకు? ఆయనకు తనతో పనేమిటబ్బా?" ఆశ్చర్యంగా అనుకుంది తనలో తనే.
"కాలేజీ డేకి వేసిన నాటకంలో నీ నటనను చూసి వారు బాగా ఇంప్రెస్ అయ్యారట. అందుకే వారిప్పుడు ప్లాన్ చేస్తున్న డ్రామాలో నీకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు' ప్రిన్సిపాల్ గారు ఇంకా ఏదో చెపూనే అన్నారు. ఆయన చెప్పింది విని సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాలేదు తారకు. అసలా మాటల సారాంశం పూర్తిగా అర్ధం కావడానికి పదినిముషాలు పట్టింది. “తనకు... తనకు రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలలో అవకాశం రావడమా..! అదీ ఎలాంటి ప్రయత్నం లేకుండా తనను వెతుక్కుంటూ వచ్చిన ఛాన్స్--  ఏమాత్రం అనుభవంలేని తనకు, కేవలం కాలేజీలో సరదాగా వేసిన ఒక చిన్న నాటకం చూసి ఆహ్వానం పలుకుతున్నారా? మనసంతా ప్రశ్నలతో నిండిపోతోంది. అసలు తను స్పృహలోనే వుందా? ఏమిటో ఇదంతా నమ్మశక్యం కాకుండా వుంది. రామారావుగారేదో చెప్తున్నారు. వాళ్ళ నాటక సమాజం ఇచ్చిన ప్రదర్శనల గురించి, సంపాదించిన బహుమతుల గురించి వాళ్ళు పరిచయం చేసిన నటీమణులు ఎంత పైకొచ్చిందీ, నూతన తారలను తామెంత ప్రోత్సహించేదీ ఇత్యాది విశేషాలన్నీ వివరిస్తున్నాడతను. 

తార చెవులు యాంత్రికంగా వింటున్నాయి ఆ మాటలను. ఆమె మనసు మాత్రం ఊహల్లో విహరిస్తోంది. తనప్పుడే నాటకం వేసేసినట్టు, అందులో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలతోపాటు అవార్డులు కూడా అందుకున్నట్లు, అక్కడ్నించి అలా టీవీ సీరియల్స్ లో కూడా బిజీ నటీమణి అయిపోయినట్టు ఎన్నెన్నో రంగుల దృశ్యాలు కళ్లముందు కదులుతున్నాయి.
అంత సంతోషంలోనూ ఆమెకో విషయం జ్ఞాపకం వచ్చి ఆనందాన్ని నీరు కార్చేసింది. మరో రెండు వారాల్లోనే తన ఫైనల్ పరీక్షలు. ఇప్పుడు నాటకం రిహార్సల్స్ కు ఎలా వెళ్లగలదు? అనుకోకుండా వచ్చిన అవకాశం చేజార్చుకోవలసిందేనా? దిగులుగా అనుకుంది. నిరుత్సాహం కమ్మేసిందామెను.
ఏమంటావమ్మా... ఒప్పుకున్నట్టేనా?” అడుగుతున్నారు రామారావుగారు.
సారీ సార్. మరో పదిహేనురోజుల్లో మా పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు నేను రావడం కుదరదేమో!అంది నెమ్మదిగా.
"ఫరవాలేదమ్మా. నాటకోత్సవాలకు ఇంకా రెండు నెలల టైముంది. మీ ఎగ్జామ్స్ కూడా ఈ నెలాఖరుతో అయిపోతాయని చెప్పారు ప్రిన్సిపాల్ గారు. ఆ తరువాతే నువ్వు రిహార్సల్స్ కు రావచ్చు."
ఆమడ దూరం పారిపోయిన ఉత్సాహం తిరిగివచ్చి చేరింది. అంతలోనే మరో అనుమానం మెదిలింది తార బుర్రలో. అమ్మ ఒప్పుకుంటుందా? కాలేజీలో నాటకం వేసినందుకే పెద్ద రాద్ధాంతం చేసింది. ఇక బయటి నాటకం అంటే......
మా అమ్మగారిని అడిగి వారంరోజుల్లో మీకు ఏ విషయం చెప్తాను. వస్తానండి. వస్తాను సర్ఇద్దరికీ చెప్పి వచ్చేసింది.
                                                                                              *  *  *
*
సాయంత్రం వంటకు అన్నీ సిద్ధం చేసుకుంటోంది పార్వతి. అక్కడే ఉల్లిపాయలు ఒలుస్తూ కూర్చుంది తార.
అమ్మా!నెమ్మదిగా పిలిచింది తార.
ఆ... ఏమిటి.. చెప్పు.
ఆహా ఏమీలేదులే!
ఏదో చెప్పాలనుకుంటున్నావుకదా. చెప్పుమరి.
"ఏంలేదులే.
ఇక రెట్టించలేదు పార్వతి. ఉదయంనుంచి కూతురి అవస్థను చూస్తూనే వుందామె. ఎప్పుడూ తన పనేమిటో, తనేమిటో అన్నట్టుండే కూతురు ఈరోజు లేచిన దగ్గర్నుంచీ పని వున్నా లేకపోయినా తన వెనుకే అస్థిమితంగా తిరుగుతోంది. ఏదో చెప్పాలనుకుంటోంది. చెప్పలేక పోతోంది. ఒకటి రెండుసార్లు ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఇదంతా ఓరకంట గమనిస్తున్న పార్వతి మనసులో అనుమాన బీజం మొలకెత్తింది. కూతురేం చెప్పబోతోంది? ఆమె ఊహలన్నీ ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆగిపోతున్నాయి. తార ఎవర్నయినా ప్రేమించిందా? అది బయటపెట్టడానికేనా ఈ ఆరాటామంతా? ఒకవేళ అదే నిజమైతే? తలవిదిలించింది పార్వతి. కలలో కూడా దాన్ని ఒప్పుకోలేకపోతోందామె. ఇప్పటికే కూతురికి పెళ్లి చేయకుండా చదివిస్తున్నందుకు బంధువుల విమ ర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాంటిది కూతురు ప్రేమలో పడిందంటే వాళ్ళ నోటికి హద్దుంటుందా? అది తను భరించగలదా? వెనుక మగవాడి అండవున్న ఆడవాళ్ళు ఏం చేసినా కొట్టుకుపోతుంది. అదే ఒంటరిగా బాధ్యతలు మోసే తనలాంటివాళ్ళు ఏం చేసినా అది చర్చనీయాంశమై కూర్చుంటుంది.” విషయం ఏమిటని కూతుర్ని అడగబోయింది. అంతలోనే విరమించుకుంది. అది తన మనసులో మాట బయట పెట్టినప్పుడే వింటాను. తొందరెందుకు అనుకుంది. తనకిష్టంలేని సంఘటనను భరించక తప్పదని తెలిసినప్పుడు అదెంత ఆలస్యమైతే అంత మంచిదనుకోవడం మానవ మనస్తత్వం. ప్రమాదం ముంచుకు వస్తుందని తెలిసినప్పుడు వీలైనంతవరకూ అది పోస్ట్ పోన్ అవ్వాలని చూస్తాం. సరిగ్గా పార్వతి కూడా అలాగే అనుకుంది. అయితే కూతురు తన ఊహకందని విషయం చెప్పబోతోందని, అది ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుందని తెలీదావిడకు.
తార ఆలోచనలు మరోలా వున్నాయి. అమ్మ ఒప్పుకుంటుందా? కాలేజీ ఫంక్షన్లో నటిస్తానంటేనే పెద్ద గొడవ చేసింది. అప్పుడంటే కాలేజీలో కాబట్టి ఫ్రెండ్స్ తోపాటు తనూ సరదాగా చేస్తానంటే ముందు నిప్పులు కురిపించినా, తరువాత మెత్తబడింది. మరిప్పుడు... బయటి నాటకాల్లో వేస్తానంటే భగ్గుమనదూ... ఎలా... ఎలా చెప్పడం? పోనీ ఆ ప్రసక్తి వదిలేద్దాము అంటే తన మొదటి నాటకానికే వచ్చిన ప్రశంసలు, ముఖ్యంగా ఆ రోజు అనితతో కలసి చూసిన ప్రోగ్రామ్లో ఆ కళాకారిణికి లభించిన గౌరవ మర్యాదలు గుర్తుకొ చ్చాయి. దాంతోపాటు అలాంటి ఒక ప్రత్యేకత తనకూ కావాలన్న తన ఆశా గుర్తొచ్చింది. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగానే విషయం వెల్లడవకుం డానే ఆ రోజు గడిచిపోయింది.
                                    * * *
ఏమిటి తారా! కంబైన్డ్ స్టడీస్ చేద్దామని నన్ను రమ్మని చెప్పి నువ్విలా విషాద సినిమాలో హీరోయిన్లా ఎటో చూస్తూ కూర్చుంటే ఎలా?' విసుగ్గా అంది అనిత.
ఆ మాటలతో ఉలిక్కిపడి ఇటు తిరిగిన తారను చూసి మళ్ళీ అనితే అందిపుస్తకాలు స్టడీచేసే మాట ఎలా వున్నా పావుగంటనుంచీ నువ్వలా శూన్యంలోకి చూస్తూ స్టడీ చేస్తుంటే నేను నీ భంగిమను స్టడీ చేయాల్సి వస్తోంది.
ఛ... ఈ రోజేంటో ఎంత ప్రయత్నించినా చదవలేక పోతున్నానుబాధ ధ్వనించింది తార గొంతులో.
ఎనీ ప్రాబ్లమ్? ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా?''
ఇప్పటివరకూ లేదు. ఇకముందు జరుగుతుందేమో అని నా భయం.
ఏ విషయంలో?''
నాటకం విషయంలో!''
నాటకం గురించా? ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడు గొడవ జరగడం ఏమిటి?''
 "పాత సంగతి వదిలేయ్. ఇప్పుడో కొత్త అవకాశం వచ్చిందిఅంటూ స్నేహితురాలికి అంతా వివరించింది తార.
 కాసేపు మౌనంగా ఉండిపోయి తరువాత అడిగింది అనితనీ ఉద్దేశ్యమే మిటి?''
నాకయితే వచ్చిన ఛాన్స్ వదలకూడదనీ, తప్పకుండా ఉపయోగించుకోవాలనే వుంది.
నువ్వంత ఖచ్చితంగా నిర్ణయించుకున్న తరువాత ఇక చెప్పేదేం ఉంటుంది. అయినా నాకు తెలిసినంతవరకూ ఆ ఫీల్డ్లోకి అడుగుపెట్టడం రిస్క్ తో కూడినదేమో తారా. ముఖ్యంగా స్త్రీల విషయంలో అక్కడ బయటకు చెప్పుకోలేని అసహ్యకరమైన పరిస్థితులు చాలా ఎదురవుతాయని విన్నాను. సంఘంలో కూడా రంగస్థల నటీమణులపట్ల కొద్దిగా చిన్నచూపే ఉందన్నట్టు చెప్తుంటారు.
సంఘంలో మనం అందుకునే గౌరవం అనేది మన ప్రవర్తన మీద ఆధార పడి వుంటుంది. నటనకీ, దీనికీ ఏమిటి సంబంధం? ఇక ఇబ్బందులంటావా? అవి ఎక్కడలేవు? మన పనేదో మనం చూసుకుని వచ్చేస్తే సరి! అంది తార.
తనెన్నుకున్న రంగంపట్ల అంతగా మోజు చూపిస్తున్న స్నేహితురాలిని ఇంకా తన అనుమానాలు చెప్పి నిరుత్సాహ పరచలేకపోయింది అనిత. తిరిగి తారతో అంది.సరే తారా! నువ్వింతగా ఉత్సాహపడుతున్నావు కాబట్టి ఒక పని చేయి. రామేశ్వరి అని నాకు తెలిసిన డ్రామా యాక్టర్ ఒకావిడుంది. ఆమెను నీకు పరిచయం చేస్తాను. ఆమెతో మాట్లాడితే నీకు కొంత అవగాహన కలగొచ్చు. ఆ తరువాత నువ్వు ముందుకెళ్లడమో లేదో నిర్ణయించుకో వచ్చు."
ఇదేదో బాగున్నట్టే అనిపించింది తారకు. ఒక ఫీల్డ్ లోకి అడుగు పెట్టేముందు దానికి సంబంధించిన వ్యక్తుల ద్వారా వివరాలు సేకరించడం మంచి పద్దతే. ఇది అమ్మకు నచ్చచెప్పి ఒప్పించడానికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంది. అందుకే అనిత చేసిన ప్రపోజల్ కు వెంటనే ఓకే అంది.
"అయితే ఇక ఆలస్యం ఎందుకు? రేపే వెళదాం. ఇక ఇప్పుడు చదివే మూడ్ ఎలాగూ లేదుగాని నేను వెళతాను. రేపు ఉదయాన్నే వస్తాను. రెడీగా ఉండుచెప్పి వెళ్లిపోయింది.