"" vijayavahini: Ghost train zenetti mystery italy | మిస్టరీగానే మిగిలిపోయిన శతాబ్దాలనాటి రహస్యం

Sunday, September 30, 2018

Ghost train zenetti mystery italy | మిస్టరీగానే మిగిలిపోయిన శతాబ్దాలనాటి రహస్యం

Ghost train zanetti mystery italy

ఇదో యధార్ధగాధ. 118 సంవత్సరాలుగా మిస్టరీగానే మిగిలిపోయిన ఘటన. కూ మంటూ కూతపెడుతూ వెళుతున్న Zanetti train హఠాత్తుగా అందరూ చూస్తుండగానే మాయమయిపోయింది. అలా ఎలా మాయమయిపోయింది? అది దెయ్యాల పనేనా? దెయ్యాలే ట్రైన్ ని మాయం చేశాయా? లేక ఇంవరైనా మాయం చేసారా? అసలు అందరూ చూస్తుండగానే ట్రైన్ ఎలా మయమయిపోతుంది. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. 118 సంవత్సరాల తరువాత కూడా మిస్టరీగానే మిగిలిపోయిన ప్రశ్న. పరిశోధనలకు కూడా అందని ప్రశ్న. అదే ghost train zenetti....


అది 1911  సంవత్సరం. జనెతి పేరుతో పిలిచే ఒక ట్రైన్ 106గురు ఇటాలియన్ ప్రయాణికులతో రోమ్ నుంచి బయలుదేరి లోంబాయీ వెళుతోంది.
రైలు ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు కొందరు. చేంతాడులా సాగే ఈ ట్రైన్ లో నుంచి ఎప్పుడు దిగుతామా అని విసుక్కునే వారు కొందరు. చిన్నపిల్లలా కేరింతలు, అటూ ఇటూ తిరుగుతూ వాళ్ళు చేసే సందడి, వాళ్ళను కంట్రోల్ చేయలేక విసుక్కునే పెద్దలు. ఇలా రైలు ప్రయాణమంటే అదో ప్రపంచం. జనేతి ట్రైన్ కూడా అలాగే సందడిగా బయలుదేరింది రోమ్ లో. మూడే మూడు బోగీలున్న జనేతి ట్రైన్ లో 106గురు ప్రయాణికులున్నారు. అప్పుడు వాళ్లకు తెలీదు. ఇదే తమ చివరి ప్రయాణమని.

Missing ghost train in italy romeరోమ్ లో బయలుదేరిన జనేతి ట్రైన్  మెల్లగా  సాగిపోతోంది. అలా వెళ్ళిన జనేతి రైలు ఒక సొరంగ మార్గంలో వెళ్తూ  ఉన్నట్టుండి అది మాయమైపోయింది. అదేమన్నా ఒక చిన్న వస్తువా ఎక్కడో పడిపోయి కనబడకుండా పోడానికి. మూడు బోగీలున్న ట్రైన్ అలా ఎలా మాయమౌతుంది. దెయ్యాలే దీన్ని మాయం చేసేసాయా? అంతా మిస్టరీయే.
జనేతి రైలు ప్రశాంతంగా సాగిపోతోంది. కొంతసేపట్లో ఒక టన్నెల్ లోకి ప్రవేశించబోతోంది. అందరూ చూస్తుండగానే టన్నెల్ లోకి ఎంటరయ్యింది. అంతే ఇక ఆ ట్రైన్ మరి ఎవరికీ కనిపించలేదు. అసలెక్కడికి పోయిందో.... ఏమయిపోయిందో.... ఎవ్వరికీ తెలీదు. ఆ ట్రైన్ లో ఉన్నవారేవ్వరూ ఇక లోకాన్ని చూడలేదు. వాళ్ళని లోకం చూడలేదు. వాల్లెమాయిపోయారో కూడా ఈనాటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మరి    ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ అదృశ్యమయిపోతే ట్రైన్ సోరంగంలోనే అదృశ్యమయిపోయిందని ఎలా చెప్పగలరు. ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఎస్.. ఈ ప్రశ్నకు సమాధానమే ఆ ప్రయాణికులు.

జనేతి ట్రైన్ ముందుకు సాగిపోతోంది. ఎదురుగా ఒక సొరంగం. కొన్ని క్షణాల్లో జనేతి ఆ సొరంగంలోకి ఎంటరవబోతోంది. హఠాత్తుగా సొరంగమార్గం చేరువలో దట్టంగా పొగలు రావడం కనబడింది. ముందేవుందో కనబడడంలేదు. ప్రయాణికులకు కూడా తాము ఎటు పోతున్నామో అర్థం కాలేదు. అందర్లో అలజడి మొదలయింది. అయితే అందులో ఉన్న ఇద్దరు మాత్రం విపరీతమైన భయంతో ట్రైన్ లోనుంచి దూకేశారు. అలా వాళ్ళిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళు చూస్తుండగానే ట్రైన్ ఆ గుహలోకి వెళ్లడం ఆ తరువాత కనిపించకుండా అద్రుశ్యమైపోడం జరిగిపోయింది. అలా ట్రైన్ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న ఆ ఇద్దరి ద్వారా జనేతి అదృశ్య ఘటన బయటకొచ్చింది. ఇది జరిగిన కొన్ని గంటలకే విషయం తెలుసుకున్న రైల్వే వారు రంగంలోకి దిగారు. ఎన్నో రకాలుగా ట్రైన్, ట్రైన్ లోని ప్రయాణికుల గురించి వెతుకులాట మొదలయింది. అయినా ఎటువంటి ఫలితం లేకుండాపోయింది. ఒక కిలోమీటరు పొడవున్న ఈ సొరంగంలో రైలు ఎక్కడా కనబడనేలేదు.  పోయిందో ఇప్పటికీ తెలియనేలేదట.
Mystery train zanetti


ఒక కిలోమీటరు పొడవుండే ఆ సొరంగం చాలా చీకటిగా ఉంటుంది. అలాంటి చీకటి సొరంగంలో ఆ ట్రైను ఏ మూలకు వెళ్లి  పడిపోయినా ఖచ్చితంగా కనబడి తీరాలి. కాని కనబడలేదు. ఒకవేళ భూమిలోకే క్రుంగిపోయిందా, లేక సొరంగం పక్కనే ఉన్న లోయలోకి పడిపోయిందా, ఇలా రకరకాల అనుమానాలతో ఆ సొరంగం చుట్తుపక్కల ప్రాంతాల్లో అణువణువునా గాలించారు. కాని  ఆ ట్రైను ఆచూకీ గానీ, ప్రయాణికుల ఆచూకీ గానీ దొరకనే లేదట. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా దాని అవశేషాలయినా కనబడాలి. కాని అక్కడ ట్రైన్ కి సంబంధించి గాని, ప్రయాణికుల గురించి గాని ఏ ఆచూకీ దొరకనేలేదు. ఇది ఖచ్చితంగా  దెయ్యాల పనేనని అందుకే కనీసం ఆనవాలు కూడా దొరక్కుండా ట్రైన్ ని, ప్రయాణికులను మాయం చేసేసాయని కథలు కథలుగా చెప్పుకోవడం మొదలయింది. ఆ తరువాత జనేతి ట్రైన్ కాస్తా ఘోస్ట్ ట్రైన్ గా పేరు మారిపోయింది. దాంతో ఆ తర్వాత  సొరంగ మార్గాన్ని ప్రభుత్వం మూసి వేసింది . విచిత్రం ఏమిటంటే శతాబ్దం తరువాత ఇప్పటికీ కూడా ఆ జనేతిట్రైను   గురించి వెదుకుతూనే ఉన్నారు.  కాని దాని ఆచూకీ లభించనేలేదు. ఈ ఆ ట్రైను మిస్సింగు ఇప్పటికీ పరిశోధనలకందని, అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోయింది.

No comments:

Post a Comment