"" vijayavahini

Wednesday, November 21, 2018

Ashtadasa shakti peethas|dakshayagna vinashanam|sati devi story


Ashtadasa shakti peethas|dakshayagna vinashanam|sati devi story

 శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు ఎన్నో, ఎన్నెన్నో...  ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు.ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినబడతాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ ఇలా విభిన్న సంఖ్యను చెప్తుంటారు. వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా,అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నాం.
వీటిలో పన్నెండు శక్తి పీఠాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా శ్రీలంకలో ఒకటి  మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉన్నాయి. 
ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో గయ, పిఠాపురం, జాజ్ పూర్ అనే మూడూ  గయాక్షేత్రాలూగానూ, శ్రీశైలం, ఉజ్జయిని అనే రెండూ జ్యోతిర్లింగ క్షేత్రాలూ గానూ ఉండటం మరో విశేషం. 

ఇక ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఎందుకు,ఎప్పుడు ఏర్పడ్డాయో చూద్దాం.


Wednesday, November 7, 2018

evadigola vadide, mithunam music director swara veenapani interview|72 melakartala swaraveenapani


mithunam music derector swara veenapani

స్వర వీణాపాణి.... ఆ పేరులోనే ఓ వైవిధ్యం.... ఆ వైవిధ్యం అసలు పేరు రమణమూర్తి. శాస్త్రీయ సంగీతంలో కృషి... సినీ సంగీతంలో ప్రవేశం....ఫిల్మ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సంగీత దర్శకత్వం....పేరుకు తగట్టు వైవిధ్యంతో కూడిన చిత్రాలు....ఇప్పుడు సంగీత చరిత్రలోనే ఓ సరికొత్త ఆవిష్కరణ ఇదీ స్వర వీణాపాణి. 72 మేళ కర్త రాగాలను వీణాపాణి ఆరున్నర నిమిషాలలో గానం చేయగల ఒక కీర్తనగా సృష్టించి ఓ సరికొత్త ఆవిష్కరణ చేసారు. దానికి స్వరకామాక్షి అని పేరు పెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీతవేత్త జుబిన్‌ మోహతా, ‘పద్మవిభూషణ్‌ మంగలంపల్లి బాల మురళీకృష్ణ, ‘పద్మభూషణ్‌ జేసుదాసు, ‘పద్మబూషణ్‌ ఎల్‌ సుబ్రహ్మణ్యం, అమెరికాలోని గ్రావిూ అవార్డు విజేత ‘పద్మశ్రీ విశ్వమోహన్‌ భట్‌, ‘భారత రత్న లతా మంగేష్కర్‌ లాంటి మహామహులు ఈ ఆవిష్కరణ నిజంగా ఓ  అద్హుతం, అపూర్వం అని ప్రశంచించారంటేనే స్వర వీణాపాణి సాధించిన ఘనత ఏంటన్నది అర్ధమవుతుంది.

పట్టుకోండి చూద్దాం చిత్రంతో సినీసంగీత రంగంలో ప్రవేశించిన స్వరవీణాపాణి తొలి చిత్రమే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. తరువాత ఎవడిగోలవాడిదే లాంటి కామెడీ చిత్రాలకు, ఆ తరువాత మిధునం, దేవస్థానం లాంటి క్లాసిక్ చిత్రాలకు  సంగీతాన్నందించి తన విభిన్నతను చాటుకున్నారు. ఆ విలక్షణ సంగీత దర్శకుడు స్వర వీణాపాణితో చిట్ చాట్ ......

Saturday, November 3, 2018

Kanyakumari tourism|Kanyakumari temple tamilnadu|vivekananda rock memorial|gandhi mandap Kanyakumar


Kanyakumari tourism|Kanyakumari temple tamilnadu|vivekananda rock memorial|gandhi mandap Kanyakumar

కన్యాకుమారి .... మూడు మహా సముద్రాల కలయికకు వేదిక కన్యాకుమారి. భారతదేశపు దక్షిణ భాగంలో చిట్టచివరి జిల్లా కన్యాకుమారి. కన్యాకుమారి ఆలయం, వివేకానంద రాక్, ప్రఖ్యాత తమిళ తిరువళ్లూర్ అరుదైన విగ్రహం, మహాత్మాగాంధీ స్మారక మందిరం, పద్మనాభపురం పేలెస్, ఇలా ఎన్నో అరుదైన అద్భుతాలకు నిలయం కన్యాకుమారి. భారతదేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఒకే  ప్రదేశంలో ఒకే సమయంలో చూడగలిగే ఒకే ఒక్క ప్రదేశం కన్యాకుమారి. 


కన్యాకుమారిలో తప్పనిసరిగా చెప్పుకోవలసిన మరో అరుదైన అద్భుతమ్ పౌర్ణమి నాడు ఒక వైపు సూర్తాస్తమయం మరో వైపు చంద్రోదయం చూడడం. గతం లో 'కేప్ కొమరిన్' గా ప్రఖ్యాతి చెందిన కన్యాకుమారి త్రివేణి సంగమంగా చెప్పుకుంటారు. తమిళ్ నాడు లో ఉన్న ప్రఖ్యాత పర్యాటకకేంద్రం కన్యాకుమారికి ఓ వైపు బంగాళాఖాతం మరోవైపు అరేబియా సముద్రం దిగువన హిందూ మహా సముద్రం ఈ మూడూ కలిసి అద్భుత ఆవిష్కరణ. పవిత్ర యాత్రాస్థలంగానే కాదు ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది కన్యాకుమారి. అందుకే ఇది  స్వదేశీయులనే కాదు వేలాదిమంది విదేశీయులను కూడా ఆకర్షించే అద్భుత ప్రముఖ యాత్రాస్థలం. భక్తీ, ముక్తి, అందం, ఆహ్లాదం, ఆశ్చర్యం, అద్భుతం వెరసి కన్యాకుమారి. సో..... ఈ రోజు వీడియోలో కన్యాకుమారి విశేషాలు చూద్దాం.....

Wednesday, October 31, 2018

Hanuman chalisa|hanuman chalisa origin history |Tulsidas story

Hanuman chalisa|hanuman chalisa origin history |Tulsidas story

 హనుమాన్ చాలీసా భయాన్ని పోగొట్టి, అభాయాన్నిచ్చేది, ధైర్యాన్ని, స్థయిర్యాన్ని ఇచ్చేది. విజయాన్ని, వీరత్వాని ప్రసాదించేది హనుమాన్ చాలీసా. ఆంజనేయ భక్తులకు అఫ్ అద్భుతవరం. ఏ చిన్న ఆపద, కష్టం, కలత కలిగినా వాటన్నిటినీ పటాపంచలు చేసే అద్భుత ఆయుధం హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసా ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో.....ఆ వివరాలు ఈ వీడియోలో......

port venkateswara temple vizag|ross hill church Visakhapatnam|ishaq madina dargah vizag|port temples

vizag port temple - ross hill - Dargakonda - ishak madina baba

 విశాఖపట్నంలో ఆ ప్రాంతం మతసామరస్యానికి చిహ్నం. అక్కడ కొలువు తీరిన మూడు కొండలు మూడు మతాలకు చెందిన చిహ్నాలు కొలువున్నా, అన్నీ కలిసి భిన్నత్వంలో ఏకత్వానికి, మతసామరస్యానికి ప్రతీకగా ఠీవిగా నిలుస్తాయి. అవే శ్రీ వేంకటేశ్వర కొండ, రాస్ కొండ, దర్గా కొండ. ఈ మూడు కొండల మీద మూడు విభిన్న మతాలకు చెందిన విగ్రహాలు ఉన్నాయి. వేంకటేశ్వర కొండ మీద వెంకటేశ్వర దేవాలయం, రాస్ హిల్ మీద వర్జిన్ మేరీ చర్చి, దర్గా కొండ మీద ఇస్లామిక్ సెయింట్ బాబా ఇషాక్ మదీనా యొక్క సమాధి ఉన్నాయి. అవి ఎప్పుడు, ఎలా, ఎందుకు ఏర్పడ్డాయో ఆ వివరాలు ఈ వీడియోలో......Ashtadasa shakti peethas|dakshayagna vinashanam|sati devi story

 శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు ఎన్నో, ఎన్నెన్నో...   ఆదిశక్తిగా , పరాశక్తిగా , జగన్మాతగా , లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకు...